నిషేధమేనా..?వేటకు వెళ్లేవారిపైనా ప్రభుత్వం నిషేధం విధిస
వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్తగా తమ్మినేని సీతారాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. తాజాగా పార్టీ పరిశీలకుల నియామకాల నేపథ్యంలో తమ్మినేని సీతారాంను పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ్మినేని నియామక ఉత్తర్వులను పార్టీ కార్యాలయం మంగళవారం రాత్రి జారీ చేసింది. అపార అనుభవం ఉన్న నాయకుడిగా, పార్లమెంట్ పరిధిలో అందరికీ పరిచయం ఉన్న నేతగా, పార్టీలో సీనియర్ నేతగా గుర్తించి పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే పార్టీ రాజకీయ సలహా కమిటీ(ిపీఏసీ) సభ్యులుగా ఉన్న తమ్మినేనికి తాజా గా పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


