పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు

Apr 28 2025 12:21 AM | Updated on Apr 28 2025 12:21 AM

పాలిస

పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్‌–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా ప్రవేశాల ఇన్‌చార్జి బి.జానకిరామ య్య ఆదివారం చెప్పారు. శ్రీకాకుళం, టెక్కలి రెండు డివిజన్లలో పరీక్ష నిర్వహణ ఈ నెల 30న ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 25 పరీక్ష కేంద్రాల్లో 6952 మంది, టెక్కలి డివిజన్‌లో 14 పరీక్ష కేంద్రాల్లో 4500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నా రని చెప్పారు. జిల్లాలో మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 11,452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.

రేపు జిల్లా స్థాయి అండర్‌–23 బాస్కెట్‌ బాల్‌ జట్ల ఎంపికలు

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాస్థాయి అండర్‌–23 బాలబాలికల బాస్కెట్‌ బాల్‌ జట్ల ఎంపికలు ఈనెల 29వ తేదీన జరుగుతాయని బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపికలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొ న్న బాల, బాలికలు 23 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బాస్కెట్‌బాల్‌ కోచ్‌ జి.అర్జున్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంపికలలో పాల్గొన్న క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబర్‌ను సంప్రదించాలని వారు కోరారు.

జోషితకు డీఈఓ అభినందనలు

మందస: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించిన హరిపురం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని కంచరాన జోషితను డీఈఓ ఎస్‌.తిరుమల చైతన్య ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతిని పెంచిందని అన్నారు. తల్లిదండ్రులు లేపాక్షి, మాధవరావులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా జోషితకు రూ.10వేలు నగదు బహుమతి అందజేశారు. విజయానికి కారణమైన హరిపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలను మీకోసం డాట్‌ ఏపీ డాట్‌ జివో వి డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నమోదైన అర్జీల గురించి దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్‌ చేయవచ్చని వివరించారు.

భావనపాడు

తీరం సందర్శన

సంతబొమ్మాళి: భావనపాడు తీర ప్రాంతాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ట్రీ ఫౌండేషన్‌, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం 420 తాబే లు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. కార్యక్రమంలో భావనపాడు సర్పంచ్‌ బుడ్డ మోహన్‌రెడ్డి, ట్రీ ఫౌండేషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సోమేశ్వరరావు, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి నరేంద్ర, బీట్‌ అధికారి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు 1
1/1

పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement