
అంగన్‌వాడీ కేంద్రాలపై కేంద్ర బృందం ఆరా
గార : గార ప్రాజెక్టు పరిధిలోని కొర్ని అంగన్‌వాడీ కేంద్రాన్ని నాగాలాండ్‌కు చెందిన జుబోమో జామి, ఒబెద్ మఘ శనివారం సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించిన ‘సుపోషణ పంచాయతీ’కి ఎంపిక చేసేందుకు జిల్లాలో ఈ బృందం పర్యటిస్తోంది. బాలామృతం పంపిణీ, రోజువారి అందించే ఆహారం, గుడ్లు వినియోగం, చిన్నారుల బరువు, ఎత్తు కొలవడం, ఆట వస్తువుల వినియోగం, చిన్నారులకు అందించే పుస్తకాలు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పోషణ వాటికలు నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో గార సీడీపీవో పి.నాగరాణి, రణస్థలం సీడీపీవో సీహెచ్.ఝాన్జీభాయి, అంగన్‌వాడీ కార్యకర్తలు వజ్జ అలివేలు మంగమ్మ, ఎన్ని గోపమ్మ తదితరులు పాల్గొన్నారు.