ప్రజలు ఆనందంగా గడపాలి
హిరమండలం: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు నిత్యం ఆనందంతో గడపాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధి అంధవరపు వెంకట సురేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వస్తువుల క్రయ, విక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. మోసాలకు గురవ్వకుండా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


