విశ్రాంత జవానుకు సైబర్ షాక్
కోటి కలల కొత్త ఏడాది సంబరం
● సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట రూ.1.31 కోట్లు టోకరా..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఓ విశ్రాంత జవాన్ సైబర్ మోసానికి గురయ్యారు. ఏకంగా రూ.1.31 కోట్లను సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట మోసపోయాడు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. కాశీబుగ్గ రోటరీనగర్‌కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావు (67)కు ఈ ఏడాది మార్చి 3న ఓ వీడియో కాల్ వచ్చింది. అందులో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి మీ ఆధార్ కార్డుతో లింక్ వున్న ఫోన్ సిమ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురైందని, దానికి సంబంధించి సయ్యద్‌ఖాన్ అనే వ్యక్తి మీతో టచ్‌లోకి వచ్చి అంతా చేశాడని, ఇప్పటికే అతన్ని అరెస్టు చేశామన్నారు. దీనికి ప్రతిగా సయ్యిద్‌ఖాన్ ఖాతా నుంచే కాకుండా వేర్వేరు ఖాతాల నుంచి రూ. 30 లక్షలు మీ బ్యాంకు ఖాతాలకు నగదు మళ్లిందనడడానికి రుజువులు ఉన్నాయన్నారు. తక్షణమే మీ బ్యాంకు బుక్‌లు, ఇతర ఆధారాలన్నీ మెయిల్ చేయాలని, బయట వ్యక్తులకు తెలియపర్చరాదని బెదిరించాడు. మరుసటి రోజు మళ్లీ వీడియో కాల్‌లో సీబీఐ వాళ్లమని, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పారు. దీంతో బెదిరిపోయిన షణ్ముఖరావు తన పేరనున్న ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారు నగలు తనఖా పెట్టి రెండు నెలలు దఫదఫాలుగా రూ.1,31,85,000 వారు చెప్పిన ఖాతాలకు మళ్లించాడు. రెండు నెలల తర్వాత మళ్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో మళ్లీ ఫోన్ చేయడంతో మోసపోయానని గ్రహించిన షణ్ముఖరావు తన కుమారుడికి తెలపడంతో పోలీసులను ఆశ్రయించారు. బుధవారం కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


