
దౌర్జన్యకాండ
● కూటమి పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలు ● భయాందోళనలో జిల్లా ప్రజలు
రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అత్యాచారాలు, దాడులు, హత్యలతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నేనొస్తే శాంతియుత పరిస్థితులు ఉంటాయి. హత్యలు, అత్యాచారాలకు ఆస్కారమివ్వను. తప్పు చేసినోడికి మళ్లీ తప్పు చేయకూడదనేలా ట్రీట్‌మెంట్ ఇస్తాను. – ఎన్నికల ప్రచార సభల్లో
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల కా లంలో 17 హత్యలు.. ఈ ఏడాదే 9 హత్యలు.. అంతకు రెట్టింపు దొంగతనాలు, ఊరూరా రాజకీయ దాడులు, చిరుద్యోగులపై వేధింపులు, అక్రమాల ను నిలదీస్తే దాడులు.. వెరసి సిక్కోలులో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి అనడానికి ఈ లెక్కలే సాక్ష్యం. గంజాయి మత్తులో యువ త నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లాకేంద్రంలో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేకే గంజాయి బాబులు పట్టుబడటం చూస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 8 హత్యలు
● మంత్రి అచ్చెన్న సొంత పంచాయతీ నిమ్మాడలోని వెంకటాపురం గ్రామ అమ్మ వారి ఉత్సవాల్లో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా తోట మల్లేషు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి తర్వాత మరణించాడు.
● ఆగస్టు 18 అర్ధరాత్రి ఎచ్చెర్ల ఫరీద్‌పేటకు చెందిన వైఎస్సార్ సీపీ సాధారణ కార్యకర్త కూన ప్రసాద్‌ను దారి కాచి టీడీపీ కార్యకర్తలు కొట్టారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 24న మరణించాడు.
● జూన్ 5 రాత్రి సోంపేట కొర్లాం జాతీయ రహదారి సమీపంలో సంగీత దాబాలో సిబ్బంది మద్య జరిగిన గొడవలో మాదుగుల రాంబాబు (54)ను హత్య చేశారు.
● జూన్ 24న ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన కొండ్ర కుప్పయ్యను అతని భార్య హరమ్మ నిద్రలో ఉండగా కత్తితో దాడి చేసి చంపేసింది.
● జూన్ 30న ఇచ్ఛాపురం స్వర్ణపురం బీచ్‌లో ఆసి బాలు అనే యువకుని ఛాతీపై బలమైన ఆయుధంతో గాయపర్చి హత్య చేశారు.
● జూలై 2న పొందూరు మండలం తాడివలస సమీప బొడ్డేపల్లి గ్రామానికి చెందిన అమలాపురం రాజేశ్వరిని నరసన్నపేట మండలం ఉర్లాంకు చెందిన గోపాల్ హత్య చేసి మృతదేహాన్ని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి లొంగిపోయాడు.
● డిసెంబరు 6న గార మండలం శ్రీకూర్మం ఆర్టీసీ కూడలిలో ఉప్పాడ రాజేష్ అనే యువకున్ని పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు దాడిచేసి హతమార్చారు.
● అక్టోబరు 22న నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం వనవిష్ణుపురం అమ్మవారి పత్రికొమ్మల విషయంలో ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకోవడంతో టీడీపీకి చెందిన పాలిన వీరాస్వామి మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి.
ఈ ఏడాది 9 హత్యలు..
● జనవరి 19న జిల్లాకేంద్రంలోని న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను బంగారం కోసం అతి కిరాతకంగా యువకుడు చంపేశాడు. ● జనవరి 25న ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో సొంత భర్త గరుగుబిల్లి చంద్రయ్య తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరో పదిమందితో కలిసి భార్య ఈశ్వరమ్మ హత్య చేయించింది.
● ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీకాలనీలో మద్యం మత్తులో భార్యను భర్తే హత్య చేశాడు. ● ఫిబ్రవరి 24న జిల్లాకేంద్రంలో టి–ఏజెంట్‌కాలనీలో మజ్జి రమేష్‌నాయుడు (34)ను వేధింపులు తాళలేక, పిల్లలను సైతం కొట్టడంతో భార్య శశి హత్య చేసింది.
● మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను ఆమె భర్త అప్పలరెడ్డి మద్యం మత్తులో దారుణంగా నరికి చంపేశాడు. ● మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలు దారుణహత్యకు గురైంది.
● మార్చి 28న కవిటి మండలం ఆర్.కరాపాడు గ్రామ శివారు రైల్వేగేటు వద్ద 5 నెలల గర్భిణి కొంతాల మీనాక్షిని భర్తే కర్కశంగా దాడి చేయించి చంపేశాడు. ● ఏప్రిల్ 15న జి.సిగడాం మండలం సంతపురిటిలో వివాహిత బి.భవానిని తన భర్త గొంతు నులిమి హత్య చేశాడు.
● ఏప్రిల్ 19న పైడిభీమవరంలో ఆవాల భవాని (25) అనే వివాహితను చంపేశారు.
అక్టోబరు 16న జిల్లా నడిబొడ్డున బలగమెట్టు వద్ద వందలమంది జనాలు చూస్తుండగా సనపల సురేష్ అనే వ్యక్తిని కారును జీపు, బైకులతో కొంతమంది అడ్డగించి కొట్టారు.
అక్టోబరు 27న కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో దళిత దంపతులైన చల్ల అప్పలరాజు, దమయంతిలపై టీడీపీ గూండాలు ధర్మాన శ్రీను, ధర్మాన ప్రసాద్, తంగి షణ్ముఖ, పల్లి వైకుంఠరావు, పగోటి సీమలు, పగోటి అప్పారావు, మరో 70 మంది ఇంటికొచ్చి మరీ దాడికి పాల్పడ్డారు.
అదే రోజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సాక్షిగా మాజీమంత్రి సీదిరి అనుచరులు అల్లు రమణ, మన్మధలపై టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు.
అక్టోబరు 26న ఉత్సవాల్లో డ్యాన్స్ చేయనన్నందున తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక, ఆమె తల్లిపై పలాస మండలం తెలుగు యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు దాడికి పాల్పడ్డాడు.
నవంబరు 16న వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు మహిళలపై దాడి చేశారు.
రాజమండ్రికి చెందిన నకిలీ నోట్ల ప్రధాన నిందితున్ని మన జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులతో కలసి కారులో తెస్తుండగా సినీఫక్కీలో 20 మందికి పైగా కారులు, బైకుల్లో వచ్చి దాడికి ఎగబడి ప్రధాన నిందితున్ని ఎత్తుకుపోయారు.
2025 జనవరి 21న పలాస మండలం రామకృష్ణాపురం చిన్ననీలావతి గ్రామానికి చెందిన పౌరహక్కుల నేత తెప్పల ఢిల్లీరావు (57) అనుమానాస్పదరీతిలో పంటపొలంలోనే విద్యుత్ తీగలు తగిలి మృతిచెందాడు. ఇది హత్యేనని అనుమానాలు ఉన్నాయి.
జనవరిలో పాతపట్నం దువ్వారివీధికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త పెద్దింటి తిరుపతిరావుపై వేకువఝామున గుర్తుతెలియని వ్యక్తులు మెడపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
మార్చి 30న రణస్థలం మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి బాత్రూమ్‌లో ఉరికి వేలాడుతూ అనుమానాస్పదంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు పరిశ్రమ ముందు ఆందోళన చేశారు. ఇలాంటి ఘటనలు మరెన్నో జరిగాయి.

దౌర్జన్యకాండ

దౌర్జన్యకాండ

దౌర్జన్యకాండ