
● కల్యాణం..కమనీయం..
అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణ సేవ గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఛైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవారి కల్యాణమూర్తులను అనివెట్టి మండపంలో కొలువుదీర్చి ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణం జరిపించారు. రూ.500 చెల్లించిన భక్త దంపతులకు ఆలయం తరఫున స్వామి వారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
– అరసవల్లి