
పంట పొలాల్లో.. దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు
సంతబొమ్మాళి: రొయ్యిల వ్యాపారి తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, దౌర్జన్యంగా పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వేశారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం సెగిడి లక్కివలసకు చెందిన శంకరమహేష్ అనే వ్యాపారి టెక్కలి మండలం నాయుడుపేటలో ఇటీవల రొయ్యిల చెరువులను కొనుగోలు చేశారు. వాటికి విద్యుత్ కనెక్షన్ కోసం వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్తంభాలను కొంతవరకు దౌర్జన్యంగా వేశారు. ఈ విషయం తెలియడంతో నౌపడ, సీతానగరం గ్రామాలకు చెందిన పలువురు రైతులు సదరు వ్యాపారిని ప్రశ్నించారు. తమకు చెప్పకుండా వ్యవసాయ పొలాల్లో ఎలా విద్యుత్ స్తంభాలు వేశారని రైతులు విశ్వగురు శర్మ, వాడరేవు గణపతి, కూర్మనాయకులు, బి.అప్పారావు, చిన్నబాబు తదితరులు నిలదీశారు. దీనిపై సదరు వ్యాపారి స్పందిస్తూ పొలాల్లో వేసిన స్తంభాలు తీసివేసి ప్రభుత్వ భూమి మీదుగా స్తంభాలు వేయిస్తానని నమ్మబలికాడు. ఆ వ్యాపారి మాటలు నమ్మి రైతులు వెనుతిరిగారు. ఇప్పుడు రైతుల స్తంభాలు తీయకపోగా రాత్రి వేళ విద్యుత్ శాఖ సిబ్బందితో పని చేయించి హైటెన్షన్ విద్యుత్ వైర్లతో కనెక్షన్‌ను రొయ్యిల చెరువుకు ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇదేంటని సదరు వ్యాపారిని ప్రశ్నించగా ‘మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నాకు ఏమీ కాదు’ అంటూ సదరు వ్యాపారి బెదిరిస్తూ మాట్లాడారు. మా పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వేసి హై టెన్షన్ వైర్లకు ఉప్పు గాలులతో ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు నిలదీశారు. ఈ సమయంలో సదరు వ్యాపారి దురుసుగా ప్రవర్తించాడని రైతులు ఆరోపించారు. దీంతో శనివారం జిల్లా కలెక్టర్‌కు, విద్యాత్ శాఖ ఉన్నతాధికారులకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా రైతులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగకపోతే కోర్టులో పోరాడతామని
రైతులకు సమాచారం ఇవ్వని రొయ్యిల వ్యాపారి
కలెక్టర్, విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు