పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
● కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ● తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్ ● తొలిరోజు ఉత్సాహంగా బీచ్ ఫెస్టివల్
సోంపేట:
బారువ సముద్ర తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బారువ సముద్ర తీరంలో రెండు రోజుల పా టు నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా శనివా రం ఉదయం ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచే పెట్టే ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే బి.అశోక్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల జీవిత చక్రం గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. బీచ్ వాలీబాల్ పోటీలు, పడవ పోటీలు ప్రా రంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తీరంలోని పరిసరాలు పరిశుభ్రం చేశారు.
కార్యక్రమంలో భాగంగా సోంపేట నటరాజ నాట్యకళామండలి చిన్నారుల సాంస్కృతిక కార్యక్ర మాలు అలరించాయి. బారువ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా యని కేంద్ర మంత్రి తెలిపారు. స్కూబా డైవింగ్, పారామోటార్ ఫ్లయింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు బారువ కేంద్రంగా మారుతుందన్నారు. వచ్చే నెల 3, 4న వివిధ పోటీలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది రెండు లక్షల తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థా లు సముద్రంలోకి విడిచి పెట్టకుండా సేఫ్ డిస్పోజల్ చేయాలన్నారు. ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ మాట్లాడుతూ బారువ తీరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీచ్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రదీప్, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం, కెప్టెన్ సూర్య తదితరులు మాట్లాడుతూ అభివృద్ధి జరిగితే స్థానిక యువతకు ఉపాధి లభి స్తుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అటవీశాఖాధికారి వెంకటేశ్వ రరావు, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటఅప్పారావు, ఆర్డీఓ వెంకటేష్, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ సుప్రజ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సర్పంచ్‌కు దక్కని గౌరవం
సభా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యర్ర రజినీని పిలవకపోవడంపై గ్రామస్తులు చర్చించుకున్నారు. పంచాయతీ పరిధిలో జరిగే సమావేశానికి సర్పంచ్ కీలకం. సర్పంచ్ సభాస్థలి వద్ద ఉన్నా ఇటు అధికారులు గానీ, అటు ప్రజా ప్రతినిధులు గానీ సభావేదికపైకి సర్పంచ్‌ను పిలవలేదు.
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం


