నాటి మార్పులే.. | - | Sakshi
Sakshi News home page

నాటి మార్పులే..

Apr 18 2025 1:33 AM | Updated on Apr 18 2025 1:33 AM

నాటి

నాటి మార్పులే..

పేదల ఇంటిలో దీపాలు వెలిగించిన పథకాలివి. సరస్వతీ కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేక మరుగున పడిపోతున్న నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచిన కార్యక్రమాలివి. ప్రభుత్వ బడులపై ఉన్న చిన్నచూపును నాడు–నేడు సమూలంగా పోగొడితే, డబ్బుల్లేక చదువులు ఆగిపోయే పరిస్థితిని అమ్మ ఒడి రూపు మాపింది. ఖర్చులకు భయపడి పెద్ద చదువులకు దూరమవుతున్న వారికి విద్యా దీవెన, వసతి దీవెన వరాల్లా మారాయి. ఆ ఫలితాలే ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన గొప్ప మార్పులకు ఈ విజయాలే తార్కాణాలు.

నాడు–నేడు అమ్మ ఒడి విద్యాదీవెన వసతి దీవెన..

వైఎస్‌ జగన్‌ హయాంలో

ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటైన ఐవీఎఫ్‌ ప్యానెల్‌

శ్రీకాకుళం న్యూకాలనీ/బూర్జ/ ఆమదాలవలస:

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందుచూపు ప్రభుత్వ విద్యార్థుల పాలిట వరంగా మారింది. గత వైఎస్సాసీపీ ప్రభుత్వ హయాంలో వారంతా ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని, విలువలను అందిపుచ్చుకున్నారు. అమ్మఒడితో ఆర్థిక భరోసాను, విద్యాకానుకతో చదువుకు అవసరమైన సామగ్రిని అందుపుచ్చుకుని, రూపా యి ఖర్చు లేకుండా అన్ని వసతులు, సౌకర్యాలతో ఇంగ్లిష్‌ మీడియంతో పదో తరగతి చదువులను పూర్తిచేశారు. పదో తరగతిలోను మెరిసిన ఆ బిడ్డలు.. తాజాగా ఇంటర్మీడియెట్‌లోను సత్తాచాటారు.

ఆగమేఘాల మీద సత్కారాలు..

గత ప్రభుత్వం చేసిన సత్కారాలకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద సత్కార కార్యక్రమాలను నిర్వహించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో జగనన్న ఆణిముత్యాల పే రిట వివిధ మేనేజ్‌మెంట్లవారీగా నాలుగు స్థాయిల్లో అంటే పాఠశాల/కళాశాలస్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో అవార్డులు, సత్కారాలు, నగదు ప్రోత్సాహాకాలను ఏర్పాటుచేసి రెండు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేవారు. ఈ విషయం విద్యార్థులందరికీ బాగా తెలుసు. రాష్ట్రస్థాయి వేడుకల్లో స్వయంగా నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా రూ.లక్ష చొప్పున రివార్డు అందజేసేవారు. విద్యార్థులతోపాటు వారి ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులను సైతం సత్కరించేవారు. కానీ ప్రస్తుతం ఒక్క విద్యార్థులకు మాత్రమే షైన్‌ అవార్డుల పేరిట సత్కారాలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది.

బడిలో సదుపాయాలు

ఇంటర్‌ ఫలితాల్లో అదరహో అనిపించిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు

వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన వసతులు, సౌకర్యాల కల్పన

రూపాయి ఖర్చు లేకుండా ఇంగ్లిష్‌ మీడియంలో బోధన

నాటి మార్పులే.. 
1
1/1

నాటి మార్పులే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement