ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: స్థానిక ఎన్‌టీఆర్ కాలనీ 7వ లైన్‌లో నివాసముంటున్న ముడిదాన కేశవరావు(38) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగాం మండలం హుకుంపేట గ్రామానికి చెందిన కేశవరావు టెక్కలి ఎన్‌టీఆర్ కాలనీ 7వ లైన్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య నాగమణి నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. పిల్లలు రమ్య, గణేష్ బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, తాపీమేసీ్త్రగా పనిచేసే కేశవరావు అప్పులు అధికంగా వాడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంటి కరెంట్ బిల్లు సైతం కట్టకపోవడంతో కనెక్షన్ కట్‌చేశారని, ఫైనాన్స్ కట్టకపోవడంతో ద్విచక్ర వాహనం సైతం తీసుకెళ్లిపోయారని, మద్యాని బానిస కావడంతో చివరకు మనస్థాపం చెంది మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుడి మామ జామి భీమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


