చదువుకు వయస్సు అడ్డురాదు. కొంత మందికి న్యాయ విద్యలో డిగ్రీ అన్నది దీర్ఘకాలిక కల. 65 ఏళ్ల వయస్సులో బీకే కళావతి అనే మహిళ శ్రీకాకుళంలోని ప్రైవేట్ న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు. ప్రస్తుతం ఈమె డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో మూడో సెమిస్టర్ పరీక్ష రాస్తున్నారు. ఈమెది తమిళనాడు రాష్ట్రం. బార్ కౌన్సిలాఫ్ ఇండియా నిబంధనలు మేరకు దేశంలో ఎక్కడైనా న్యాయ విద్య చదివే అవకాశం ఉంది. – ఎచ్చెర్ల క్యాంపస్
ఉద్దండపాలెం విద్యార్థికి కోటి రూపాయల కొలువు
సంతబొమ్మాళి మండలంలోని పాలతలగాం పంచాయతీ ఉద్దండపాలెం గ్రామానికి చెందిన ఆర్ట్స్ విద్యార్థి హనుమంతు సింహాచలం భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సు మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఆర్‌ఎం) పూర్తిచేసిన సింహాచలం రూ. 1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో పోలాండ్‌కు చెందిన ప్రముఖ డెయి రీ సంస్థ కోవైస్కోలో హెచ్‌ఆర్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించాడు. సింహాచలం తల్లిదండ్రులు హనుమంతు భీమారావు, కమలకుమారి వ్యవసాయం చేస్తుంటారు. సింహాచలం విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో సాగింది. 2022 ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సులో చేరినప్పటి నుంచి అధ్యాపకులు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సలహా మేరకు కమ్యూనికేషన్ స్కిల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2024లో కోర్సు పూర్తయిన వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్‌లో రూ.3.6లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అక్కడే పనిచేస్తూ మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో పోలాండ్‌లోని డెయిరీ సంస్థ తమ హెచ్‌ఆర్ విభాగంలో పోస్టుల భర్తీకి యూనివర్సిటీ అధికారుల ను సంప్రదించగా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తనకు సమాచా రం ఇచ్చారని సింహాచలంతెలిపారు. ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో సంస్థ హెచ్‌ఆర్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసింది. మే నెలలో విధులకు సిద్ధం కావాలని సమాచారం ఇచ్చిందని హనుమంతు సింహాచలం తెలిపారు. – సంతబొమ్మాళి
65 ఏళ్ల వయసులో పరీక్ష కేంద్రానికి..


