ఫోరంను ఆశ్రయించా
2023లో ఓ మొబైల్ షోరూమ్‌లో రెండు ఫోన్లను మొత్తం రూ.20 వేలతో కొనుగోలు చేశాను. కొన్న నెల రోజుల్లోపే ఆ రెండు ఫోన్లు పాడైపోయాయి. షోరూమ్ వాళ్లను అడిగితే తమకు సంబంధం లేదన్నారు. దీంతో బిల్లులు, ఆధారాలతో సహా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాను. ఐదు నెలల్లోనే నాకు రెండు ఫోన్లకు నష్ట పరిహారంగా రూ.42 వేల వరకు కోర్టు ద్వారా వచ్చింది. ఎవరైనా నష్టపోతే నిరభ్యంతరంగా కోర్టును ఆశ్రయించవచ్చు. – కె.శ్రీనివాసరావు, వైద్యశాఖ ఉద్యోగి
ఏసీ పోతే..
పొందూరు మండలంలోని గోరింట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది ఏప్రిల్‌లో ఏసీ మిషన్‌ను రూ.32వేలకు కొన్నారు. వారం రోజులు తిరగక ముందే ఆ మిషన్‌పోయింది. దీంతో ఆ య న సర్వీసు సెంటర్‌కు, ఏసీ కొన్న దుకాణానికి చాలాసార్లు వెళ్లి చూశారు. నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. విచారణ అనంతరం పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ ఇవ్వాలని, అన్ని ఖర్చులు కలిపి రూ.42వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
వినియోగదారుడికి ఉపశమనం
టెక్కలిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఓ వినియోగదారుడికి విద్యుత్ సేవల్లో తీవ్రమైన జాప్యం కల్పించారు. అంతే కా కుండా ఆర్థికంగా, మానసికంగా వేధించారు. దీనిపై సీజీఆర్‌ఎఫ్‌ను ఆశ్రయిస్తే న్యాయం చేశారు.
– కె.కిశోర్, స.హ.చట్టం ప్రతినిధి, టెక్కలి
రెండుసార్లు గెలిచా..
2011లో ఓ బ్యాంకులో నేను వేసిన డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సిన కాలం పూర్తయినా ఇవ్వకపోవడంతో శ్రీకాకుళం వినియోగదారుల ఫోరంలో అన్ని ఆధారాలతో కేసు వేసి నేనే వాదించాను. మూడు నెలల్లో నాకు నా రూ.లక్ష సొమ్ముతోపాటుగా బ్యాంకుకు 15శాతం వడ్డీ చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5వేలు ఇచ్చారు. అలాగే 2019లో నేను విజయనగరంలోని ఓ కొరియర్ సర్వీసులో ఒక అత్యవసర కవర్ పంపాను. అది వారికి చేరలేదు. అడిగితే నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. దీంతో విజయనగరం వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీంతో నిర్లక్ష్యానికి మూల్యంగా రూ.10వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఖర్చుల కోసం రూ.3వేలు ఇవ్వాలని సూచించింది. కానీ వారు ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు వేశా.
– కొమ్మాజ్యోస్యుల వసంతకుమార్, శ్రీకాకుళం
కస్టమరు.. గెలిచారు
కస్టమరు.. గెలిచారు
కస్టమరు.. గెలిచారు