
● ముగిసిన బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కా మన్ ఎంట్రన్స్ టెస్ట్ –2024(ఏపీఈఏపీ సెట్) కొనసాగుతోంది. గురు, శుక్రవారాల్లో నిర్వహించిన బైపీ సీ స్ట్రీం పరీక్షలు ముగిశాయి. శనివారం నుంచి ఎంపీసీ స్ట్రీం పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం హాజరు పరిశీలిస్తే చిలకపాలెం శివానీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 204 కి 190, రెండు షిఫ్టులో 205 కి 190, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 180 కి 160, రెండో షిఫ్టులో 180 కి 167, టెక్కలి ఐతం కళాశాలలో మొదటి షిఫ్టులో 300 కి 289, రెండో షిప్టులో 304 కి 278, నరసన్నపేట కోర్ టెక్నాలజీస్ ఆన్‌లైన్ కేంద్రంలో మొదటి షిఫ్టులో 330 కి 303, రెండో షిఫ్టులో 330కి 307 మంది హాజరయ్యా రు. రెండో రోజు శుక్రవారం 2033కి 1884 మంది హాజరు కాగా, 149 మంది గైర్హాజరయ్యారు. రెండు రోజుల్లో బైపీసీ స్ట్రీంలో 4060 మందికి 3,753 మంది హాజరు కాగా, 307 గైర్హాజరయ్యారు. శనివారం నుంచి ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు పరీక్షలు కొనసాగుతాయి.