‘బ్యాంక్‌ అప్రయిజర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘బ్యాంక్‌ అప్రయిజర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి’

Feb 25 2024 1:02 AM | Updated on Feb 25 2024 1:02 AM

సవరమధ్య సమీపంలో ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న బెల్లం ఊటలు  - Sakshi

సవరమధ్య సమీపంలో ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న బెల్లం ఊటలు

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో ఉన్న అన్ని బ్యాంక్‌లలో పనిచేస్తున్న బ్యాంక్‌ అప్రయిజర్స్‌కు ఉద్యోగభద్రత కల్పించాలని ఆల్‌ బ్యాంక్‌ గోల్డ్‌ అప్రయిజర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు కె.మోహన్‌, కె.దుర్గాప్రసాద్‌, డి.అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీహాల్‌లో శనివారం ఆల్‌ బ్యాంక్‌ గోల్డ్‌ అప్రయిజర్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్‌ బ్యాంక్‌ గోల్డ్‌ అప్రయిజర్స్‌కు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలపై అన్ని బ్యాంక్‌ల అప్రయిజర్స్‌ సమష్టిగా పోరాటం చేయాలన్నారు. మార్చి 10న విజయవాడలో ఆల్‌ బ్యాంక్‌ గోల్డ్‌ అప్రయిజర్స్‌ ద్వితీ య మహాసభ జరగనుందని తెలిపారు. ఈ సభకు అందరు అప్రయిజర్స్‌ హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం చలో విజయవాడకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆల్‌ బ్యాంకు అప్రైజర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు కె .మొహనరావు కె.దుర్గా ప్రసాద్‌, ఎస్‌.శ్రీనివాస్‌, పి.మురళి, ఎం.రాంబాబు, ఏఐటీయూసీ నాయకుడు తిరుపతిరావు, అధిక సంఖ్యలో అప్రయిజర్స్‌ పాల్గొన్నారు.

కన్నయ్య కళ్లు సజీవం

టెక్కలి రూరల్‌: స్థానిక మెట్టవీధికి చెందిన చిలుకు కన్నయ్య(79) శనివారం మృతిచెందారు. మృతి విషయం తెలుసుకున్న టెక్కలి ప్రజా చైతన్య కళాసమితి నిర్వాహుకులు మల్లారెడ్డి పద్మనాభం, దూసి ఆంధ్రాస్టాలిన్‌లు మృతుడి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి ఒప్పించారు. అనంతరం శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ నేత్ర సేకరణ సొసైటీ సిబ్బంది కె.పవన్‌, టి.సుజాతలు కన్నయ్య నేత్రాలను సేకరించారు. నేత్ర దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు.

అద్దె బస్సుల కోసం

టెండర్ల ఆహ్వానం

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో ఏపీఎస్‌ ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 32 బస్సులను సరఫరా చేసేందుకు ఔత్సాహిక ఆపరేటర్ల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి కలిగిన ఆపరేటర్లు ఎంఎస్‌టీసీ ఈ–కామర్స్‌ పోర్టల్‌ www. mstce commerce.com నందు రిజిస్టర్‌ చేసుకుని, ఈ నెల 21 తేదీ నుంచి మార్చి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్ల ప్రక్రి యలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ మార్చినెల 14వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సూపర్‌ లగ్జరీ: శ్రీకాకుళం – విజయవాడ మార్గంలో 1 బస్సు, అల్ట్రా డీలక్స్‌: శ్రీకాకుళం – విశాఖ మార్గంలో 6 బస్సులు, పలాస – విశాఖ మార్గంలో 3 బస్సులు, ఎక్స్‌ప్రెస్‌: శ్రీకాకుళం – విజయనగరం మార్గంలో 4, శ్రీకాకుళం – పాలకొండ మార్గంలో 2, ఇచ్ఛాపురం – విశాఖపట్నం మార్గంలో 4 బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు: శ్రీకాకుళం – విశాఖపట్నం మార్గంలో 2 బస్సులు, పల్లె వెలుగు: శ్రీకాకుళం – సాలూరు మార్గంలో 1, శ్రీకాకుళం – బత్తిలి మార్గంలో 5, టెక్కలి – పలాస (వయా పూండి) మార్గంలో 2, శ్రీకాకుళం – పలాస మార్గంలో 1, టెక్కలి – శ్రీకాకుళం(వయా సంతబొమ్మాళి) మార్గంలో 1 బస్సు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ బస్సులు శ్రీకాకుళం 1వ డిపోకి 11, శ్రీకాకుళం 2వ డిపోకి 12, టెక్కలి డిపోకి 6, పలాస డిపోకి 3, మొత్తం కలిపి 32 బస్సులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు విజయ్‌కుమార్‌ తెలిపారు. మరిన్ని వివరాల కోసం apsrtc.ap.gov.in వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు

మందస: మందస మండలంలోని గిరిజన ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఎస్‌ఈబీ సోంపేట సీఐ ఆర్‌.జైభీమ్‌ ఆధ్వర్యంలో పిడిమందస పంచాయతీలోని సవరమధ్య ప్రాంతంలో గల నిర్వహించిన ఈ దాడుల్లో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేశారు. సారా తయారీ, అమ్మకాలు అరికట్టేందుకు కృషి చేస్తున్నామని, నిందితులను గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోఒ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రేమ్‌కాజల్‌ ఆదేశాల మేరకు నాటుసారా తయారీ కేంద్రా లు, అమ్మకాలు, రవాణాపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. దాడుల్లో ఎస్‌ఐ వై.చంద్రమోహన్‌, సిబ్బంది మోహనరావు, కాంతారావు, యోగీశ్వరరావునాయుడు పాల్గొన్నారు.

చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బ్యాంక్‌ గోల్డ్‌ అప్రయిజర్స్‌   1
1/2

చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బ్యాంక్‌ గోల్డ్‌ అప్రయిజర్స్‌

నేత్రదానం చేసిన మృతుడు కన్నయ్య  2
2/2

నేత్రదానం చేసిన మృతుడు కన్నయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement