ప్రతి రోజూ కమర్షియల్ సిలిండర్స్ డిమాండ్ 1000
అక్రమంగా స్టాక్ చేసిన ఏజెన్సీల పై చర్యలు కూడా
తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
వచ్చిన వాటిలో కొన్ని ఏజెన్సీలు అక్రమంగా స్టాక్ చేసి, పంపిణీ చేయకుండా నిల్వ చేసి, బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరఫరా
100 మాత్రమే.
ప్రభుత్వ హాస్టళ్లలో గ్యాస్ కష్టాలు మామూలుగా లేవు.
కట్టెల పొయ్యే గతి
వినియోగదారులకు గ్యాస్ అందకపోవడంతో కట్టెల పొయ్యి గతిగా మారింది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్‌లు వినియోగదారులకు తీవ్రంగా వేధించడంతో చిరుదుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దుకాణాలు మూత వేయలేక, అలా అని నడపలేక ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు: 38
డొమెస్టిక్
గ్యాస్ కనెక్షన్‌లు
కమర్షియల్
గ్యాస్ కనెక్షన్‌లు
6,12,000
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: గ్యాస్.. సామాన్య వినియోగదారుడు నుంచి హోటల్ యజమానుల వరకు అందరి నోటా ఇదే మాట. గతంలో గ్యాస్ బుక్ చేసుకుంటే ఒకటి రెండు రోజుల్లో వచ్చేసేది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని వారాలు గడుస్తున్నా అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 38 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వీటిలో హోటళ్లు, రెస్టారెంట్, చిరు వ్యాపారులు వినియోగించే కమర్షియల్ గ్యాస్ కనెక్షన్‌లు 4,320 ఉన్నాయి. అలాగే గృహ వినియోగదారులు వినియోగించేందుకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్‌లు 6,12,000 ఉన్నాయి. అయితే ప్రధానంగా కమర్షియల్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా రోజుకి 1,000 గ్యాస్ సిలిండర్‌లు అందాల్సి ఉండగా నేడు కేవలం 100 సిలిండర్లు మాత్రమే అందటంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలను తెరవలేని దయనీయ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో భోజన ప్రియులు సైతం ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్, చిరు దుకాణాల్లో రుచికరమైన భోజనాలు ఆరగించే భోజన ప్రియులు మూత బడిన దుకాణాలు చూసి విస్తుపోతున్నారు. వీటిలో పనిచేస్తున్న వారికి ఉపాధి కరువైంది. కొంత మంది చిరు దుకాణ నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితిలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.
కొరత లేదంటూనే...
వంటలు చేసేందుకు గృహిణులు సైతం అనేక తంటాలు పడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇంటిలో గ్యాస్ లేక, గ్యాస్ బుక్ చేస్తే ఏజెన్సీలు పెట్టిన కొర్రీలు వంట చేసే మహిళలకు శాపంగా మారాయి. గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ పొగతో నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాలో గ్యాస్ కొరత ఇంతలా వేధిస్తుంటే అధికారులు మాత్రం కొరత లేదు అంటూ ప్రకటనలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అధికారులు చెప్పినట్లు గ్యాస్ కొరత లేకపోతే తాము గ్యాస్ బుక్ చేసుకుప్పటికీ ఎందుకు సకాలంలో రావడం లేదని లబ్ధిదారులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. జిల్లా అధికారులు వారి మెప్పు కోసం ఉత్త గ్యాస్ ప్రకటనలే చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే ప్రజలు పడుతున్న గ్యాస్ కష్టాలు వారి కళ్లకు కనిపిస్తాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాయింట్ కలెక్టర్‌పై నెపం..
జిల్లా అధికారులు చేసిన ప్రకటనలు నిజమైతే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి ఎక్కడా లేదు. దీనికి కారణం గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్‌ను కృతిమ కొరత సృష్టిస్తున్నాయా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
● కొన్ని ప్రాంతాల్లో ఒక్కో గ్యాస్ సిలిండర్ వినియోగదారుడి అవసరాన్ని బట్టి అదనంగా రూ.300 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు.
● డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా వినియోగదారులకు మాత్రం సకాలంలో అందడం లేదు. ప్రశ్నిస్తుంటే మా చేతిలో ఏమి లేదని, అంతా జేసీ చేతిలో ఉందని చెప్తూ చేతులు దులుపుకుంటున్నారు.
● దీంతో గ్యాస్ కోసం ఏం చేయాలో తెలియక బహిరంగ మార్కెట్‌లో అధిక డబ్బులు ఇచ్చి మరీ గ్యాస్‌ను కొనుకుంటున్నామని కొందరు వాపోతున్నారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ ప్రకటన
గ్యాస్ దొరక్క అల్లాడిపోతున్న లబ్ధిదారులు
మూతపడుతున్న చిరు దుకాణాలు


