రిటైర్డ్‌ డీఎంహెచ్‌ఓకు రూ.56 లక్షలకు టోకరా | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ డీఎంహెచ్‌ఓకు రూ.56 లక్షలకు టోకరా

Mar 20 2026 7:53 AM | Updated on Mar 20 2026 7:53 AM

● పుడమి తల్లి పూజలో...

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని ఓ రిటైర్డ్‌ డీఎంహెచ్‌ఓ సైబర్‌ మోసానికి గురయ్యారు. కేటుగాళ్లు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమని శనివారం రూ.56.25 లక్షలకు టోకరా వేశారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. పీఎన్‌ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ డీఎంహెచ్‌ఓకు గత ఏడాది డిసెంబర్‌ 17న ఓ వీడియో కాల్‌ వచ్చింది. అందులో పోలీస్‌ గెటప్‌లో ఉన్న ఓ వ్యక్తి ‘ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులం’ అని చెబుతూ మీరు డీఎంహెచ్‌ఓగా ఉండేటప్పుడు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని, అనేకమంది మహిళలకు సంబంధించి అశ్లీల వీడియోలు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బెదిరిస్తూ.. మిమ్మల్ని అరెస్టు చేయడం తప్పదని, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్‌ కింద కొంత మొత్తం చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితుడు డిసెంబర్‌ 19న రూ.15.75 లక్షలు, 29న రూ. 21.74 లక్షలు, ఈ ఏడాది జనవరి 5న రూ. 18.75 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లోకి ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా పంపించాడు. అప్పటికీ వాళ్లు మరో రూ. 18 లక్షలు అడగడంతో తాను సైబర్‌ మోసానికి గురయ్యానని గ్రహించాడు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ లో సైబర్‌ క్రైమ్‌ వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేశాడు. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement