సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి

Mar 20 2026 7:53 AM | Updated on Mar 20 2026 7:53 AM

బాలకృష్ణ నేత్రదానం

శ్రీకాకుళం కల్చరల్‌: నూతన సంవత్సరంలో జిల్లా సమగ్ర అభ్యున్నతికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో గురువా రం ఘనంగా జరిగాయి. కలెక్టర్‌, శాసన సభ్యు లు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందే విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

పంచాంగం శ్రవణం

శ్రీపరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ పండితులు ధర్మపురి గౌరీశంకరశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు బాగుంటాయని తెలిపారు.

ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలు

జిల్లాలో ముగ్గురు అర్చకులకు ఉగాది పుర స్కారాలను అందించారు. నగరంలోని కోదండరామాలయం ప్రధాన అర్చకులు బంకుపల్లి శేషాచార్యులకు, గుజరాతీపేట జగన్నాథ స్వా మి దేవాలయం అర్చకులు పెంట సత్యన్నారాయణ శర్మకు, ఎల్‌ఎన్‌పేట జగన్నాథ స్వామి దేవాలయం అర్చకులు వినోద్‌ కుమార్‌ స్వామి కి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. శివ శ్రీ నృత్య కళానికేతన్‌ గురువు శ్రీకాంత్‌ రఘుపాత్రుని కళా బృందం ప్రదర్శించిన కూచిపూడి, కోలాటం నృత్యాలు ఆహూతులను అలరించాయి. కవులు ఆలపించిన కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఇచ్ఛాపురం: పట్టణ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ, చిన్నకొండవీధికి చెందిన యువకుడు ఉప్పాడ కుమార్‌ (23) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు యువకుడు ద్విచక్రవాహనంపై బెల్లుపడ నుంచి పట్టణం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ గుడి సమీపంలో బెల్లుపడ వైపు వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని వివరాలు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి త్రినాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం కల్చరల్‌: గార మండలం శ్రీ కూ ర్మంకి చెందిన అంధవరపు బాలకృష్ణ మూర్తి (88) కన్ను మూయగా ఆయన నేత్రాలను దా నం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, కొడుకు అంధవరపు బాలకృష్ణమూర్తి, అంధవరపు శ్రీనివాస నెహ్రూలు రెడ్‌క్రాస్‌కు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్‌ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వా రా కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 7842699321 కు సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement