23న జిల్లాకు సీఎం జగన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

23న జిల్లాకు సీఎం జగన్‌ రాక

Nov 9 2023 2:24 AM | Updated on Nov 9 2023 2:24 AM

బహిరంగసభ కోసం  ప్రైవేటు స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ 
 - Sakshi

బహిరంగసభ కోసం ప్రైవేటు స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ

కాశీబుగ్గ: ఉద్దాన కిడ్నీ బాధితుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలాసలో రూ.50 కోట్లతో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌, ఎస్పీ జి.ఆర్‌.రాధిక పలాసలో పలు ప్రాంతాల్లో ముందస్తు పరిశీలన చేపట్టారు. రూట్‌మ్యాప్‌, హెలీప్యాడ్‌, బహిరంగ సభావేదికపై అధికారులతో చర్చించారు. కిడ్నీ బాధిత గ్రామానికి వెళ్లే అవకాశం ఉన్నందున రామకృష్ణాపురం, రంగోయి గ్రామాల స్థితిగతులపై ఆరా తీశారు. బహిరంగ సభ వేదిక ఖరారైతే అధికారిక షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం విడుదల చేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర, పలాస ఆర్డీఓ భరత్‌ నాయక్‌, కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ షరీఫ్‌, తహశీల్దారు మధుసూదనరావు, వీఆర్‌ఓల సంఘ అధ్యక్షుడు కంచరాన ఖగేశ్వరనాయుడు, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పి. శ్రావణి శ్రీనివాస్‌, మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మీసాల సురేష్‌బాబు, బి.కృష్ణారావు, కమిషనర్‌ నాగేంద్రకుమార్‌, నాయకులు డబ్బీరు భవానీశంకర్‌, దున్న సత్యం, సురేంద్ర నారాయణ త్యాడి, రోణంకి శ్రీనివాస్‌, తమ్మినాన శాంతారాం, బల్ల శ్రీనివాసరావు, బి.డి.రావు, ఎస్‌.సింహాచలం, కోరాడ ధనరాజు తదితరులు పాల్గొన్నారు.

పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ప్రారంభం

ముందస్తు పరిశీలన చేసిన మంత్రి,

కలెక్టర్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement