వివాహిత అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Oct 10 2023 2:16 AM | Updated on Oct 10 2023 1:02 PM

- - Sakshi

శ్రీకాకుళం: పెళ్లయిన ఆరు నెలలకే వివాహిత మృతి చెందిన సంఘటన మెళియాపుట్టి మండలంలోని ముకుందాపురం పంచాయతీ పరశురాంపురంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పరశురాంపురం గ్రామానికి చెందిన జన్ని కృష్ణారావుతో పొగడవెల్లి గ్రామానికి చెందిన జన్ని అశ్విని (21) మార్చిలో వివాహం జరిగింది. అశ్విని సోమవారం మధ్యాహ్నం బహిర్భూమికని గ్రామశివారు ప్రాంతానికి వెళ్లింది.

అక్కడి నుంచి వచ్చిన తర్వాత నోటి నుంచి నురగలు కక్కుతూ, మాట్లాడలేని స్థితిలో ఉండటంతో వెంటనే కుటుంబసభ్యులు ఆటోలో మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరారు. ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించనున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement