2
గంటల్లోనే
మందస: ఓ వలస జీవికి రెండు గంటల్లోనే రేషన్ కార్డు అందించిన ఘటన ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలో గుసారి బ్లాక్‌లోని బొమ్మిక అనే గ్రా మం నుంచి మూడేళ్ల కిందట కిక్కర జోగమ్మ అనే వృద్ధురాలు మందస మండలంలోని కొంకడాపుట్టి పంచాయతీలో గల సందిగాం అనే గ్రామానికి వలస వచ్చింది. ఒడిశా నుంచి రావడంతో ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చేరలేదు. ఏం చేయాలో తెలీక ఇటీవల గ్రామ వలంటీరు లండ తిరుపతిరావు తన సమస్యను విన్నవించుకుంది. సమస్యను విన్న వలంటీరు తిరుపతిరావు కొంకడాపుట్టి సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ సవర మోహన్ వద్దకు జోగమ్మను తీసుకెళ్లి రేషన్‌కార్డు లేదని వివరించగా.. ఆయన రేషన్‌కార్డుకు దరఖాస్తు చేశారు. అన్ని వివరాలు సక్రమంగా ఉండడంతో కేవలంలో రెండు గంటల్లోనే జోగమ్మకు సర్పంచ్ మజ్జి కుమారచంద్ర, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి నాగేశ్వర బృందావన్, పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది రేషన్‌కార్డు అందజేశారు. దీంతో ఆమె సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంకు రుణపడి ఉంటాను
ఒడిశా నుంచి ఆంధ్రాకు వలస వచ్చాను. తెలుగు మాట్లాడడం సక్రమంగా రాని పరిస్థితి. పేదరికంతో బాధ పడుతున్నాను. రేషన్‌కార్డు లేకపోవడంతో నిత్యావసర సరుకులతో పాటు పథకాలు కూ డా వర్తించలేదు. ఎంపీడీఓ వాయలపల్లి తిరుమలరావుకు సమస్యను వివరించాను. ఆయన చొరవతో వలంటీరు వద్దకు వెళ్లాను. ఆయన సచివాలయానికి తీసుకెళ్లి కార్డుకు దరఖాస్తు చేయించారు. సుమారు రెండు గంటల్లోనే రైస్‌కార్డును చేతికి అందజేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను.
– కిక్కర జోగమ్మ, రైస్‌కార్డు లబ్ధిదారు,
సందిగాం
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
అర్హులందరికీ పథకాలు వర్తిస్తున్నాయి. స్పం దనలో సమస్యలను పరిష్కరిస్తున్నాం. వ్యక్తిగతంగా కొంతమంది సమస్యలను ఫిర్యాదు చేస్తున్నారు. వీరికి ప్రోపర్ చానెల్ ద్వారా పరిష్కరించి, పథకాలను మంజూరు చేయిస్తున్నాం. ప్రభుత్వం అర్హులందరికీ పథకాలు అందివ్వాలన్న మంచి సంకల్పంతో ఉంది. దీన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలి.
– వాయలపల్లి తిరుమలరావు,
ఎంపీడీఓ, మందస.
కొంకడాపుట్టి సచివాలయంలో రైస్‌కార్డు అందుకుంటున్న వృద్ధురాలు కిక్కర జోగమ్మ


