కాశీబుగ్గలో మాట్లాడుతున్న యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్
కాశీబుగ్గ: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రచార జాతా నిర్వహించారు. ఇచ్ఛాపురంలో ప్రారంభమై శ్రీకాకుళం వెళ్తూ పలాసలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు విజయవాడ చేరుతాయని, అక్టోబర్ 1వ తేదీన పదివేల మంది ఉపాధ్యాయులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పలాసలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యూటీఎఫ్‌గా సమాజంలో ఉండే రుగ్మతలకు వ్యతికేకంగా పోరాడాలని, ఉపాధ్యాయ సంక్షేమమే కాకుండా పేద ప్రజానీక సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కేఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజ చౌదరి, రవీంద్ర రెడ్డి, మోహనరావు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి యూటీఎఫ్ శ్రీకాకుళం అగ్రనేత బొడ్డేపల్లి మోహనరావు పాల్గొన్నారు.


