సమావేశమైన కాలేజీ యాజమాన్యం
శ్రీకాకుళం/శ్రీకాకుళం రూరల్: మునసబుపేటలోని గురజాడ విద్యాసంస్థల అనుబంధ సంస్థ గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్‌మెంట్ కళాశాలకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించిందని విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు శుక్రవారం తెలిపారు. గత నెల 15, 16 తేదీల్లో కేరళలోని కాలడి ఆదిశంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వ కులపతి ఆచార్య మోనిపల్లి చంద్రశేఖరం నాయర్ దిలీప్‌కుమార్ బృందం గాయత్రి కాలేజీకు వచ్చి ప్రయోగశాలలు, పరీక్షల నిర్వహణ, భవన సముదాయాలు, జిమ్, సోలార్ సిస్టమ్, ఆటస్థలం, మెస్, కరిక్యులం, విద్యార్థుల ప్రగతి, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి అనేక అంఽశాలు పరిశీలించి ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారని వివరించారు. నాక్ ఎ ప్లస్ గ్రేడ్ పొందిన తొలి కళాశాలగా జిల్లాలో గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల నిలిచిందన్నారు. నాక్ సలహాదారునిగా పొన్నాడ వెంకటరమేష్ వ్యవహరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు పులఖండం శ్రీనివాసరావు, విద్యా సంస్థల డైరెక్టరు అంబటి రంగారావు, ఐక్యూఎసీ కోఆర్డినేటర్ మార్తాండ కృష్ణ, విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు వి.మహేష్, కె.వి.వి.సత్యనారాయణ, పి.సీతారామునాయుడు తదితరులు పాల్గొన్నారు.


