నాడు సంక్షేమం.. నేడు అరాచకం | - | Sakshi
Sakshi News home page

నాడు సంక్షేమం.. నేడు అరాచకం

Nov 24 2026 1:06 AM | Updated on Nov 24 2026 1:06 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాప్తాడు నియోజకవర్గంలో నాడు నీళ్లు పారితే.. నేడు రక్తం పారుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తే.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలకూ అన్యాయం చేసిందన్నారు. సుమారు 2.50 లక్షల ఓట్లున్న రాప్తాడు నియోజకవర్గ ప్రజలు గత ఐదేళ్ల పాలన, ప్రస్తుత పాలనకు వ్యత్యాసాన్ని బేరీజు వేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాలు, ఈ–క్రాప్‌ బుకింగ్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. రైతుల బీమా ప్రీమియాన్ని సైతం అప్పటి ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ప్రస్తుతం ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే, ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. గతంలో జలకళ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో సుమారు 2 వేల బోర్లు వేయించామని, ప్రస్తుతం పేరూరు డ్యాంకు నీరు అందకపోవడం, కాలువ లైనింగ్‌తో సుమారు 20 వేల బోర్లు ఎండిపోయాయన్నారు. 110 గ్రామాలకు పీఏబీఆర్‌ ద్వారా తాగునీరు అందించేందుకు చేపట్టిన పథకంలో 90 శాతం పనులు పూర్తయినా మిగిలిన పనులను పూర్తి చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్న సర్పంచ్‌ అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

సర్పంచు అభ్యర్థులు వీరే :

చెన్నేకొత్తపల్లి మండలం : బసంపల్లి చెన్నమ్మ, బసినేపల్లి ఎం.నరేష్‌, చెన్నేకొత్తపల్లి బి.అక్కులప్ప, గంగినేపల్లి నాగరాజు, కనుముక్కల గోసల అంజలి, మేడాపురం కిరణ్‌సాయి, ముష్టికోవెల గాయత్రి, నాగసముద్రం మధుసూదన్‌రెడ్డి, న్యామద్దెల స్వాతి, ఓబులంపల్లి అలివేలమ్మ, పులేటిపల్లి కే.సోము, ప్యాదిండి బి.జయవర్ధన్‌రెడ్డి, వెల్దుర్తి రమణారెడ్డి, వెంకటంపల్లి రాజేశ్వరి, గంగినేపల్లి తండా మరి నాయక్‌ పేర్లను వెల్లడించారు.

కనగానపల్లి మండలం : బద్దలాపురం జి.ముత్యాలమ్మ, భానుకోట రామకష్ణ, దాదులూరు జ్యోతి, ఎలకుంట్ల సాయినాథ్‌రెడ్డి, కనగానపల్లి నందిని, కోనాపురం లక్ష్మీదేవి, కొండపల్లి శ్రీరాములు, కోనేటినాయునిపాల్యం భరత్‌రెడ్డి, మద్దెలచెరువు వెంకటేష్‌, మామిళ్లపల్లి సరస్వతి, ముత్తవకుంట్ల తేజస్విని, నరసంపల్లి సుకన్య, పాతపాల్యం శీనప్ప, తగరకుంట వరలక్ష్మి, తూముచెర్ల ముత్యాలమ్మ, వేపకుంట రుక్మిణమ్మ, కుర్లపల్లితండా శీనానాయక్‌ పేర్లను ప్రకటించారు.

రామగిరి మండలం : గంతిమర్రి కురుబ రాజశేఖర్‌, కొండాపురం గంగరత్నమ్మ, కుంటిమద్ది సుభద్ర, మాదాపురం బండారు అనిల్‌కుమార్‌, మోటార్‌చింతలపల్లి జి.అరుణమ్మ, పేరూరు దాసరి మోహన్‌, పోలేపల్లి కురువ శ్రీరాములు, రామగిరి చాకలి సరోజమ్మ పేర్లను వెల్లడించారు.

జగన్‌ హయాంలోని సంక్షేమ పథకాలకు నేడు మంగళం

చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం

ఆరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ

మద్దతు సర్పంచ్‌ అభ్యర్థుల ప్రకటన..

అందరినీ గెలిపించాలని

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement