త్రోబాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

త్రోబాల్‌ జట్ల ఎంపిక

Nov 24 2026 1:06 AM | Updated on Nov 24 2026 1:06 AM

ధర్మవరం: ఉమ్మడి అనంతపురం జిల్లా సీనియర్‌ త్రోబాల్‌ జట్ల ఎంపిక పోటీలు పోటాపోటీగా జరిగినట్లు యశోద పాఠశాల డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌, ప్రిన్సిపాల్‌ అనూప్‌కుమార్‌, సూర్య స్కూల్‌ కరస్పాండెంట్‌ నరేంద్ర తెలిపారు.సోమవారం పట్టణంలోని యశోద పాఠశాలలో ఉమ్మడి అనంతపురం జిల్లా సీనియర్‌ త్రోబాల్‌ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని నలుమూలల నుంచి 120 మంది బాలబాలికలు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ ఎంపిక పోటీలను అనంతపురం జిల్లా త్రోబాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ అనంతమ్మ, జాయింట్‌ సెక్రటరీ అశోక్‌, సాకే శివశంకర్‌, బొగ్గు రవి, సీనియర్‌ క్రీడాకారులు పర్యవేక్షించారు. ఎంపికై న జిల్లా జట్లు ఈనెల 28,29 తేదీల్లో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్‌ త్రోబాల్‌ పోటీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున పాల్గొంటాయని వారు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గోరంట్ల: మండలంలోని బూడిదగడ్డపల్లి సమీపంలో సోమవారం కోడూరు– పుట్టపర్తి రోడ్డుపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు డీకొన్నాయి. ఈప్రమాదంలో కారు డ్రైవర్‌ వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేటకు చెందిన నాగభూషణ (55) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కారులోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన భాస్కర్‌, మస్తానమ్మ, నితిన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేటకు చెందిన నాగభూషణం తన కారులో బెంగళూరు నుంచి కడప వైపు వెళ్తుండగా, పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్తున్న మరోకారు ఢీకొనింది. ఘటనలో కారు నడుపుతున్న నాగభూషణం డ్రైవర్‌ సీట్లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

లారీ ఢీ.. యువకుడి మృతి

● మృతుడు అన్నమయ్యజిల్లా వాసిగా గుర్తింపు

నల్లచెరువు: మండల పరిధిలోని రాత్నాలపల్లి సమీపంలోని దాబాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఎస్‌.నందకుమార్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నందకుమార్‌ మదనపల్లిలోని శ్రీవారి ఫైనాన్స్‌ సంస్థలో పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా కదిరి నుంచి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే రాత్నాలపలల్లి సమీపంలోని దాబాల వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన లారీ.. ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనింది. ఈ ప్రమాదంలో నందకుమార్‌ తలభాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement