గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Nov 24 2026 1:06 AM | Updated on Nov 24 2026 1:06 AM

పావగడ: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతిచెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి ఈనెల 21న స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. చికిత్స ఫలించక మృతిచెందాడు. మృతుడికి సుమారు 45 నుంచి 50 ఏళ్లలోపు వయసుంటుందన్నారు. అతని ఆచూకీ తెలిసిన వారు పావగడ పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

కాపర్‌వైరు చోరీపై ఫిర్యాదు

కదిరి అర్బన్‌: మండలంలోని పలు గ్రామాల్లో ఆరు ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌వైరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌నాయక్‌ రూరల్‌అప్‌గ్రేడ్‌ పోలీస్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అలీపూర్‌తండా, వరిగిరెడ్డిపల్లి, పట్నం గ్రామాల్లో దొంగలు ట్రాన్‌ఫార్మర్‌లోని కాపర్‌వైర్‌ దొంగలించారని, సుమారు రూ.57 వేలు ఉంటుందని ఏఈ తెలిపారు.

కారు ఢీకొని

వృద్ధుడి దుర్మరణం

బొమ్మనహాళ్‌: మండలంలోని ఎల్‌బీనగర్‌ సమీపంలో సోమవారం రాత్రి కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వెంకటేశ్వర్లు (62) మృత్యువాతపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు.. ఎల్‌బీనగర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు బస్టాండ్‌ నుంచి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌లో ఇంటికి వెళ్తుండగా, బొమ్మనహాళ్‌ నుంచి కణేకల్లు క్రాస్‌ వైపు వెళ్తున్న ఓ కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోవడంతో తలకు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో బళ్లారిలోని విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన్నట్లు తెలిపారు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య రాధమ్మ ఉంది. ఎస్‌ఐ నబీరసూల్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement