నామినేషన్‌ కేంద్రంలో అధికారుల ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రంలో అధికారుల ‘పచ్చ’పాతం

Nov 24 2026 1:06 AM | Updated on Nov 24 2026 1:06 AM

లేపాక్షి: ప్రాదేశిక ఎన్నికల్లో అధికార పార్టీకి అధికారులు తొత్తుల్లా వ్యవహరించారు.. ఆ ఎన్నికల నుంచి అధికార పార్టీని గట్టెక్కించారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచు ఎన్నికల్లోనూ అధికారుల ‘పంచాయితీ’ ఎక్కువైంది. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా అధికార టీడీపీకి చెందిన అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రంలోకి నిబంధనలు సడలించి పంపుతున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన అభ్యర్థులకు నిబంధనల సాకుచూపుతూ అడ్డుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్‌ వేసే అభ్యర్థులు తమ వెంట ప్రతిపాదికునితో పాటు ఇద్దరు సాక్షులతో కలిసి వెళ్లాల్సి ఉంటుంది. అయితే లేపాక్షిలో మాత్రం సోమవారం అధికార పార్టీ సర్పంచు అభ్యర్థులతోపాటు కార్యకర్తల మందను అనుమతించి అధికారులు విమర్శలమూటకట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతున్న అభ్యర్థులు నామినేషన్‌ వేయాలంటే వారి వెంట ఇద్దరు మాత్రమే వెళ్లాలనే నిబంధనలున్నాయని కేంద్రంలోకి అనుమతించకపోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేపాక్షి పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా లలితమ్మ నామినేషన్‌ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు ఆమె భర్త, టూరిజంశాఖ డైరెక్టర్‌ జయప్ప, మాజీ ఎంపీపీ ఆనంద్‌కుమార్‌, టీడీపీ నాయకులు సూర్యప్రకాష్‌, ప్రభాకర్‌రెడ్డి, గంగిరెడ్డి, శరణ్‌ నామినేషన్‌ వేయడానికి వెళ్లారు. ఆసయమంలో అధికారులు ఆపార్టీవారందరినీ అనుమతించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విషయంలో పోలీసులు, అధికారులు ఇద్దరిని మాత్రమే అనుమతించారు. కల్లూరులోనూ అధికార పార్టీ నాయకులు పార్టీ కాండువాలు, బైక్‌ ర్యాలీలతో నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. దీన్ని పట్టించుకోని పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు పార్టీ కండువాలు వేసుకోకూడదని సర్పంచ్‌ అభ్యర్థి హరిని ఫోన్‌లో బెదిరించారు. అదేవిధంగా చోళసముద్రంలో టీడీపీ సర్పంచ్‌ అభ్యర్థి బైక్‌ ర్యాలీతో పాటు పార్టీ కండువాలు, జెండాలతో ఊరేగించారు. టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పోలీసులు, అధికారులుపట్టించుకోలేదు. అదే వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తే పోలీసులకు గుర్తుకు వస్తాయా? అని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

అధికార పార్టీకి ఏజెంట్లుగా

వ్యవహరిస్తున్న వైనం

కూటమి పార్టీ నాయకులకు

నిబంధనల సడలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement