వీడని పీఠముడి | - | Sakshi
Sakshi News home page

వీడని పీఠముడి

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అంశం ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు టీడీపీ నుంచి

పరిటాల శ్రీరామ్‌.. మరోవైపు జనసేన నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం కోసం నానా

తంటాలు పడుతున్నారు. కూటమి

పార్టీలకు సంబంధించి ఏ జిల్లా నుంచి

ఏ పార్టీ చైర్మన్‌ పీఠం అధిరోహించాలనే విషయం ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాకపోయినా ఎవరికి వారు గంపెడాశలు పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్‌ జెడ్పీటీసీ స్థానానికి దిగొచ్చినట్లు ఆయన

అభిమానులు ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

సాక్షి, పుట్టపర్తి: మరో మూడు రోజుల్లో జెడ్పీటీసీల ప్రమాణం స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. అయినా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గిరి ఏ పార్టీని వరిస్తుందనే అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జనసేన, టీడీపీ మధ్య సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం వద్ద జనసేన సభ్యుడు చిలకం మధుసూదన్‌రెడ్డి లాబీయింగ్‌ చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులతో పరిటాల శ్రీరామ్‌ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ క్రమంలో చైర్మన్‌ పీఠం తమ పార్టీనే వరిస్తుందంటూ రెండు పార్టీల కార్యకర్తలు సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా ప్రచారం చేస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఓట్లు.. సీట్లు చూడాలంటూ..

మిత్రపక్షమైనప్పటికీ జనసేన కార్యకర్తలు ఓట్లు, సీట్లు చూసి చైర్మన్‌ పీఠం ఆశిస్తే బాగుంటుందని ‘తెలుగు తమ్ముళ్లు’ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే బోణీ కూడా చేయలేని పార్టీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం ఆశించడం సబబు కాదని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి జిల్లా పరిషత్‌ కేటాయిస్తారనే ఉద్దేశంతోనే పరిటాల శ్రీరామ్‌ నల్లచెరువు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేశారని గుర్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేనకు మరిన్ని అవకాశాలు రావాలంటే జెడ్పీ చైర్మన్‌ టీడీపీకి కేటాయించాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు.

కూటమి ధర్మం పాటించాలంటూ..

ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించామంటే జనసేనతో కలవడంతోనే అంటూ జనసైనికులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఇచ్చిన మాట తప్పితే రానున్న రోజుల్లో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు. చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే స్థాయి ఉన్న నాయకుడేనని, జెడ్పీ చైర్మన్‌ ఆశతోనే పుట్టపర్తి రూరల్‌ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేశారని చెబుతున్నారు. మరోవైపు పొత్తు నేపథ్యంలో ‘జెడ్పీ’ గిరి తొలుత రెండున్నరేళ్లు జనసేనకు, సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీకి అంటూ చర్చలు మొదలు కావడం ఆసక్తికరంగా మారింది.

అలా అయితే టాటా..!

కూటమి పార్టీల మధ్య పోటీ తలెత్తడంతో ఎవరిని బుజ్జగిస్తారు.. ఎవరికి పీఠం కట్టబెడుతారనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ టీడీపీకి చైర్మన్‌ గిరి ఇస్తే.. ఇక నుంచి జనసేన పొత్తుకు బైబై చెబుతుందని సమాచారం. తెలుగు తమ్ముళ్లు కోరుకున్నట్లుగా పరిటాల శ్రీరామ్‌కు కట్టబెడితే చిలకం మధుసూదన్‌రెడ్డితో సహా జనసేన కార్యకర్తలు టీడీపీకి సహకరించకుండా.. రానున్న రోజుల్లో ఒంటరిగా బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది.

ఇప్పటికే బీజేపీతో కటీఫ్‌..

కూటమిలో భాగమైన బీజేపీని టీడీపీ, జనసేన ఇప్పటికే పక్కన పెట్టినట్లు సమాచారం. కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల విషయంలో టీడీపీ, జనసేన సహకరించలేదని కమలనాథులు బహిరంగ విమర్శలకు దిగారు. జిల్లా పరిషత్‌ పీఠం ఖరారు కాగానే.. టీడీపీ– జనసేన మధ్య కూడా విభేదాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

కొలిక్కి రాని జిల్లా పరిషత్‌

చైర్మన్‌గిరి పంచాయితీ

జెడ్పీటీసీలతో ఇటీవల

పరిటాల శ్రీరామ్‌ సమావేశం

అధిష్టానం వద్ద జనసేన

‘చిలకం’ లాబీయింగ్‌

మాకంటే మాకంటూ

ఇరు పార్టీల నాయకుల ప్రచారం

రసవత్తరంగా రాజకీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement