ఊపందుకున్న పంచాయతీ నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న పంచాయతీ నామినేషన్లు

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

ధర్మవరం/కనగానపల్లి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. సోమవారం మంచి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ధర్మవరం డివిజన్‌లోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాల్లో సర్పంచ్‌ స్థానాలకు 313, వార్డు స్థానాలకు 769 నామినేషన్లు దాఖలయ్యాయి. ధర్మవరం మండలంలో 20 పంచాయతీలు ఉండగా, సర్పంచ్‌ స్థానాలకు 42, వార్డు స్థానాలకు 82 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. తాడిమర్రి మండలంలో 14 సర్పంచ్‌ స్థానాలకు 44, వార్డు స్థానాలకు 64, ముదిగుబ్బ మండలంలో 25 సర్పంచ్‌ స్థానాలకు 85, వార్డు స్థానాలకు 154, బత్తలపల్లి మండలంలో 13 సర్పంచ్‌ స్థానాలకు 39, వార్డు స్థానాలకు 121 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక.. కనగానపల్లి మండ లంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా సర్పంచ్‌ స్థానాలకు 35, వార్డు మెంబర్‌ స్థానాలకు 113, చెన్నేకొత్తపల్లి మండలంలోని 15 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 54, వార్డు మెంబర్‌ స్థానాలకు 138, రామగిరి మండలంలోని 9 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 23, వార్డు మెంబర్‌ స్థానాలకు 97 నామినేషన్లు వేశారు. రామగిరి మండలంలోని నసనకోట గ్రామ సర్పంచ్‌ స్థానానికి ఇప్పటి వరకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం.

ఎందుకీ వివక్ష..?

నామినేషన్‌ కేంద్రాలకు కూటమి పార్టీల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో డప్పు వాయిద్యాల నడుమ వచ్చినప్పటికీ అడ్డు చెప్పని పోలీసులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. పోలీసుల వివక్ష వైఖరిపై పలువురు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement