కర్కశ కొడుకు | - | Sakshi
Sakshi News home page

కర్కశ కొడుకు

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

కదిరి టౌన్‌: మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో కన్న తల్లిపైనే ఓ కుమారుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన కదిరిలో కలకలం రేపింది. సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు..కదిరి మున్సిపల్‌ పరిధి కుటాగుళ్ల దర్గా వీధిలో నివాసముంటున్న మహబూబ్‌ జాన్‌ పెద్ద కుమారుడు బాబ్జాన్‌ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాంటూ కొన్నాళ్లుగా నిత్యం తల్లిని వేధిస్తున్నాడు. సోమవారం మహబూబ్‌ జాన్‌ స్థానిక చింతపండు గోడౌన్‌లో కూలి పనులకు వెళ్లగా, అక్కడికే వెళ్లి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. తన దగ్గర డబ్బుల్లేవని ఆమె చెప్పడంతో ఆగ్రహం చెంది గొడ్డలితో తలపై దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన మహబూబ్‌ జాన్‌ను తోటి కూలీలు 108 వాహనం ద్వారా కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. గోడౌన్‌ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

● మహబూబ్‌జాన్‌కు ఇద్దరు కుమారులు సంతానం. ఆమె భర్త 18 ఏళ్ల క్రితమే మృతి చెందినట్లు తెలిసింది. భర్త మరణించాక కుటుంబ బాధ్యతల్ని నెత్తినెత్తుకున్న ఆమె కూలి పనులకు వెళ్తూ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమారుడు బాబ్జాన్‌కు సంబంధం చూసి పెళ్లి చేసింది. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నట్లు తెలిసింది. తల్లి కష్టాన్ని గుర్తించి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాబ్జాన్‌ మద్యం మత్తులో కర్కశుడిగా మారి ఏకంగా ఆమె ప్రాణాలనే బలిగోరేందుకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది.

మద్యానికి డబ్బులివ్వలేదని

తల్లిపైనే గొడ్డలితో దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement