కూలి పనులకొచ్చి.. మృత్యుఒడికి | - | Sakshi
Sakshi News home page

కూలి పనులకొచ్చి.. మృత్యుఒడికి

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

పెనుకొండ రూరల్‌: పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన దినసరి కూలీలు మృత్యుఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం వైఎన్‌ఎస్‌ కోటకు చెందిన మల్లికార్జున (40), లక్ష్మణమూర్తి (38) పెనుకొండ మండలంలోని అడదాకుపల్లికి బేల్దారి పనుల నిమిత్తం వచ్చారు. ఆదివారం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు గ్రామంలోని చెరువు వద్దకెళ్లారు. లోతును గమనించకుండా మల్లికార్జున, లక్ష్మణమూర్తి చెరువులోని గుంతల్లోకి దిగారు. వారు బురద మట్టిలో కూరుకుపోతుండగా స్థానికులు గమనించి రక్షణ చర్యలు చేపట్టారు. మల్లికార్జునను బయటకు తీయగా అప్పటికే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది బురద మట్టిలో కూరుకుపోయిన లక్ష్మణమూర్తి మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లికార్జునకు భార్య ప్రమీల, కుమారులు చరణ్‌, యశ్వంత్‌ ఉన్నారు. లక్ష్మణమూర్తికి భార్య రాధమ్మ, కుమారుడు అజయ్‌, కుమార్తె చంద్రకళ ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నరసింహా తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఇద్దరు కూలీల మృతి

అడదాకుపల్లిలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement