రామగిరిలో ఏకపక్షంగా నామినేషన్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

రామగిరిలో ఏకపక్షంగా నామినేషన్‌ ప్రక్రియ

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

రామగిరి: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ఆదివారం మొదలైంది. అయితే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ భిన్నంగా సాగింది. ఈ కార్యక్రమం మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. ఆంక్షల మధ్య నామినేషన్‌కు తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు అధికారులు చుక్కలు చూపించారు. పేరూరులో టీడీపీ మద్దతుదారుడైన సర్పంచ్‌ అభ్యర్థి శ్రీనివాసులు తన నామినేషన్‌ పత్రాల్లో ఎంసీ.పల్లి అని ఉండగా అధికారులు కొట్టివేసి పేరూరు అని రాని కరెక్ట్‌ చేశారు. అది బాలేదు.. ఇది బాలేదంటూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల పత్రాలను మాత్రం తిరస్కరించారు. ఎన్నికల అధికారులు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. గత ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు అదే రీతిలో పావులు కదుపుతున్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రజలు చివరికి వైఎస్సార్‌సీపీకే పట్టం కడతారని వైఎస్సార్‌సీపీ నాయకులు మీనుగ నాగరాజు, నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, రాజేష్‌ , దాసరి మోహన్‌బాబు, రామాంజినేయులు, నర్సిరెడ్డి, సిద్ధన్న, మారుతీరెడ్డి తదితరులు పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల పత్రాలపై ఆంక్షలు

చక్రం తిప్పుతున్న ఎన్నికల అధికారులు

ఆందోళనలో వైఎస్సార్‌సీపీ వర్గీయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement