రైతు బజార్ పనులు
వేగవంతం చేయండి
పుట్టపర్తి టౌన్: రైతు బజారు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కర్ణాటకనాగేపల్లి వద్ద రైతు బజార్ పనులను పరిశీలించారు. రైతు బజారులోని ఇసుక పూడిక చేరడంతో మోటర్లు పనిచేయడం లేదని మున్సిపల్ అధికారులు నూతన కనెక్షన్లు ఏర్పాటు చేసి ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు నిరంతరం నీటి సరఫరా అయ్యేటట్లు చూడాలన్నారు. రైతు బజారు అవరణలో సీసీరోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఆగిపోయిన సెమీ స్ట్రక్చర్ ప్లాట్ పారం పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు బజార్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి రైతులు, వినియోదారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ హఫీజుల్లా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
ధర్మవరం రూరల్: ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున చురుగ్గా పని చేశాడన్న ఆక్రోశంతో ముచ్చురామి గ్రామంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకుడు ఓబిలేషుపై జనసేన నాయకులు శేఖర్, పెద్దన్న రాళ్లు, కట్టెలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు.. ఓబిలేషు గ్రామంలో తన ఇంటి వద్ద ఉండగా జనసేన నాయకులు పరుష పదజాలంతో దూషిస్తూ గొడవకు దిగారు. ఎన్నికల్లో తమ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తావా.. నీకు ఎంత ధైర్యం.. నిన్నుతంతే ఎవరు దిక్కొస్తారంటూ రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఘటనలో ఓబిలేషుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగాటిపల్లి సురేష్‌రెడ్డి బాధితుడిని పరామర్శించారు. దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి నాయకులు గూండాల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని దాడి చేసిన వారిని చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
రాళ్లు, కట్టెలతో విరుచుకుపడిన జనసేన నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో
చురుగ్గా పని చేశాడని ఆక్రోశం


