మడకశిరలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు | - | Sakshi
Sakshi News home page

మడకశిరలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

మడకశిర: పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పు తీసుకున్న వారి నుంచి దినసరి, వారం వడ్డీని పెద్ద ఎత్తున వసూలు చేస్తూ వేధిస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. ఈక్రమంలో పట్టణానికి చెందిన వడ్డీ వ్యాపారి బాధితుడు మల్లికార్జున సెల్ఫీ వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తాను ఓ వడ్డీ వ్యాపారి నుంచి రూ.2 లక్షలు అప్పు చేశానని, ఇందుకు తన 3.50 సెంట్ల స్థలాన్ని వడ్డీ వ్యాపారికి రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చానని బాధితుడు సెల్ఫీ వీడియోలో తెలిపారు. అయినా ఇంకా అప్పు తీర లేదని, అదనంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని వడ్డీవ్యాపారి తనపై దాడి చేశాడని వాపోయారు. ఈఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.

బాధితుడి సెల్ఫీ వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement