అడుగడుగునా అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అడ్డంకులు

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

● వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు, హౌస్‌ అరెస్టులు

హిందూపురం టౌన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాల నడుమ సాగాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద అడుగడుగునా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, నేతలను అధికార దర్పంతో పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గురువారం పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ముందస్తుగానే పోలీసులు ఆమెను నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు మండలంలో ఎలాంటి గ్రామాల్లోనూ పర్యటించకూడదని ఆంక్షలు విధించారు. దీనిపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటూ ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చలివేందులలోనూ వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక స్పందించి పోలీసులతో మాట్లాడిన అనంతరం వదిలివేశారు. గోళ్లాపురంలోనూ వైఎస్సార్‌సీపీ నేతలపై ఆంక్షలు విధించారు. అలాగే మండల వ్యాప్తంగా పలు వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement