లేపాక్షి: స్థానిక ఓరియంటల్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ నేతలు వెళ్లగా... వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వినిపించుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా పట్టించుకోకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే టీడీపీ నాయకులను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐతో పాటు పోలీసులు అక్కడికి చేరుకుని పోలింగ్ బూత్ల వద్ద ఉన్న టీడీపీ నాయకులను బయటకు పంపించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల చర్యలను వైఎస్సార్ సీపీ లేపాక్షి మండల కన్వీనర్ సయ్యద్ నిస్సార్, మాజీ వైస్ ఎంపీపీ అంజినరెడ్డి తప్పుపట్టారు.


