రాప్తాడు రూరల్: పరిషత్ ఎన్నికల్లో రాప్తాడు మండలం భోగినేపల్లిలో టీడీపీ శ్రేణులు యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నివాసం వద్ద తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. తగరకుంటలో రౌడీషీటర్ పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి చేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఫోన్ చేసినా శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ స్పందించడం లేదని, ప్రజా సమస్యలను ఉన్నతాధికారులు వినకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు పురుడు పోసే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


