ప్రజలు సుస్థిర జీవన విధానాలు అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు సుస్థిర జీవన విధానాలు అలవర్చుకోవాలి

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

● కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌

ప్రశాంతి నిలయం: ప్రజలు సేంద్రియ ఆహార పదార్థాలు, చిరుధాన్యాలను రోజూవారి ఆహారంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. బుధవారం రెవెన్యూ భవన్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో బుధవారం సుస్థిర ఆహార విధానాలపై ప్రత్యేక అవగాహన, పదార్థాల ప్రదర్శన, విక్రయాల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మిషన్‌ లైఫ్‌లోని ఏడు ప్రధాన అంశాల ఆధారంగా సుస్థిర జీవన శైలిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సంధర్బంగా 12 రకాల సేంద్రియ ఆహార ఉత్పత్తులు, పౌష్టికాహార ఉత్పత్తులు తదితర పదార్థాలను నిర్వాహకులు ప్రదర్శించారు. వాటి వినియోగం, ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణానికి కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌ శశికళ, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నరసయ్య, స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఆలయంలో అరాచకీయం

చిలమత్తూరు: టీడీపీ నాయకులు తమ రాజకీయాలకు ఆఖరికి శివుడిని కూడా వదలలేదు. మండల పరిధిలోని అప్పనపల్లి సమీపంలో వెలసిన భైరవేశ్వరస్వామి ఆలయంలో ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ప్రశాంతత కోసం, తమ కష్టాలను దేవుడికి చెప్పుకునేందుకు వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆ పార్టీ నాయకులను తిట్టుకుంటూ మరీ వెళ్లిపోయారు. దేవదాయశాఖ పరిధిలోని ఆలయంలో చిలమత్తూరు–3 టీడీపీ నాయకులు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు గానీ, పోలీసులు గానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

యువకుడి ప్రాణాలు

బలిగొన్న ‘ఎస్‌ఆర్‌సీ’

● బీటీపీ కాలువ పనుల్లో నిర్లక్ష్యంగా ఎమ్మెల్యే స్వంత కంపెనీ

● కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటున్న మండల వాసులు

బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పొబ్బర్లపల్లి గ్రామ సమీపంలో ఎస్‌ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో ఇటీవల పనులు ప్రారంభించారు. బీటీపీ కాలువ పనుల కోసం రోడ్డుకు రెండు వైపుల గుంతలు తవ్వి అలానే వదిలేశారు. మండల పరిధిలోని శాంతినగర్‌కు చెందిన బసాపురం రాఘవేంద్ర(17) మంగళవారం పొబ్బర్లపల్లికి వెళ్లాడు. పని ముగిశాక రాత్రి శాంతినగర్‌కు వెళ్తుండగా పొబ్బర్లపల్లి గ్రామ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం బీటీపీ కాలువ గుంతలో పడింది. ప్రమాదంలో రాఘవేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఆర్‌సీ యాజమాన్యం నిర్వాకం కారణంగానే యువకుడు మరణించినట్టు పలువురు వాపోతున్నారు. కాగా బీటీపీ కాలువ పనుల కోసం గుంతలు తవ్విన ప్రాంతంలో కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడం గమనార్హం.

ఎన్నికల విధుల రెమ్యూనరేషన్‌ పెంపు

అనంతపురం న్యూ టౌన్‌: స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది రెమ్యూనరేషన్‌, ఆహార అలవెన్సులను పెంచుతూ పంచాయతీ రాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడవ తేదీన విడుదల చేసిన 1086 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సవరించిన ధరల వివరాలిలా ఉన్నాయి. ప్రిసైడింగ్‌ అధికారి (పీఓ), కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌లకు రోజుకు రూ.500 లేదా ఏక మొత్తంగా రూ.2 వేలు చెల్లిస్తారు. పోలింగ్‌ అధికారి (ఏపీఓ/ఓపీఓ)కి రోజుకు రూ.400 లేదా ఏక మొత్తంగా రూ. 1600లు ఇస్తారు. కౌంటింగ్‌ సహాయకులకు రోజుకు రూ.450 లేదా ఏక మొత్తంగా రూ.1350లు ఇస్తారు. క్లాస్‌ ఫోర్త్‌ లేదా కార్యాలయ సహాయకులకు రోజుకు రూ.350 లేదా ఏక మొత్తంగా రూ.1400లు, చివరకు ఏక మొత్తంగా రూ.2వేలకు పెంచినట్లు ఆదేశాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement