కదిరి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో అధికారిక కూటమి చైర్మన్ అభ్యర్థి గెలిచినా నైతిక విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదే అని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం కదిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పాలక పక్షం అధికారులు, పోలీసుల సహకారంతో గెలుచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు గురి చేసినా ఓటర్లు తమకే ఓటు వేశారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు చూపిన ఆప్యాయత, ఆదరణను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ వేళ వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్ అరెస్టు చేసి అధికార పార్టీ ముఖ్య నాయకులు తమ పన్నాగాలను అమలు చేశారని చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన కదిరి పట్టణ ప్రజలు తమకు 17 కౌన్సిలర్ స్థానాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.ప్రణీత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదత్ అలీఖాన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధులకు సచివాలయ ఉద్యోగులు
కళ్యాణదుర్గం రూరల్: సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయిస్తున్నట్టు డివిజనల్ స్థాయి రెవెన్యూ అధికారులు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణదుర్గం నియెజకవర్గం వ్యాప్తంగా గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు పాల్గొనాల్సి ఉంటుంది. వివిధ సచివాలయాల్లో పని చేస్తున్న 98 మందిని ఎన్నికల విధులు అప్పజెప్పడంతో ఉద్యోగులు కంగుతిన్నారు. తాము గురువారం జరగాల్సిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించాల్సి ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాలు ఉద్యోగులమైన తామే ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నామని వారు వాపోతున్నారు. దీనిపై ఉన్నాతాధికారులను వివరణ కోరగా స్పందించలేదు.
ప్రజల ఆదరణ, ఆప్యాయతను
గుర్తుంచుకుంటాం
విలేకరుల సమావేశంలో బీఎస్ మక్బూల్, అత్తార్ చాంద్‌బాషా


