నాణ్యతలేని ఆహారం పెడతారా? | - | Sakshi
Sakshi News home page

నాణ్యతలేని ఆహారం పెడతారా?

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

అమరాపురం: ఎన్నికల విధులకు వచ్చిన మండలానికి అధికారులకు నాణ్యత లేని ఆహారం వడ్డించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలో జరిగే ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి వివిధ నియోజకవర్గాల నుంచి అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా వారికి బుధవారం మండలాధికారులు మధ్యాహ్నం రెండు గంటలైనా భోజనం వడ్డించలేదు. అనంతరం ఎన్నికల సిబ్బంది కోసం తెచ్చిన భోజనంలో అన్నం సరిగా ఉడకలేదని, సాంబారు నీళ్లగా ఉందని తాము ఇలాంటి ఆహారం ఎలా తినాలని ఎన్నికల అధికారులను నిలదీశారు. ఎన్నికల సిబ్బంది భోజనం సౌకర్యం కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఇలాంటి ఆహారం వడ్డిస్తారా? ఇది తింటే తమ ఆరోగ్యం ఏమికాను అని అధికారులను సిబ్బంది ప్రశ్నించారు. అదే విధంగా కడుపు నింపుకోవడానికి ప్లేట్లు పట్టుకొని క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల కోసం వచ్చిన సిబ్బందికి సరిపడా ఆహారం పెట్టకపోవడంతో కొందరు బయట హోటళ్లకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని మండల ఎన్నికల అధికారులను ఉపాధ్యాయ సిబ్బంది కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ భోజనం ఖర్చులకు డబ్బులను అందిస్తామని హామీ ఇవ్వడ్డంతో గొడవ సద్దుమణిగింది.

అమరాపురంలో ఎన్నికల సిబ్బందికి ఉడకని అన్నం.. నీళ్ల సాంబారు

సరిపడా భోజనం అందించకపోవడంపై సిబ్బంది ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement