రిగ్గింగ్‌, దౌర్జన్యంతోనే కూటమి విజయం | - | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌, దౌర్జన్యంతోనే కూటమి విజయం

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

మడకశిరరూరల్‌: మడకశిర నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యాలు, రిగ్గింగ్‌తోనే గెలిచారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆరోపించారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్‌ వేళ అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడి గెలిచారని తెలిపారు. బ్యాలెట్‌ భద్రపరిచిన స్ట్రాంగ్‌రూము వద్ద రాత్రిపూట ఎందుకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా తమ పార్టీ అభ్యర్థులు స్ట్రాంగ్‌ రూం వద్ద నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు ఎందుకు పంపించేశారో తెలపాలని ప్రశ్నించారు. పట్టణంలో మూడు దశాబ్దాలుగా ఓటు పడని ప్రాంతంలో ఈ ఎన్నికల్లో ఎలా పడిందో ప్రజలందరికీ తెలుసని తెలియజేశారు. గ్లాసు గుర్తు ఎవరిదో మడకశిర వాసులకు తెలియదని, అలాంటి చోట వేల ఓట్లు ఎలా పోలయ్యాయో అధికార పార్టీ నాయకులు చెప్పగలరా అని నిలదీశారు. అధికారులు టీడీపీ నాయకులు కుమ్మకై అక్రమాలకు పాల్పడి గెలిచారని, ఇది ప్రజా తీర్పు కాదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుకు ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం లేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే అని, తమ పార్టీ అభ్యర్థులకు ఓటేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలైన పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి తిప్పేస్వామి, పట్టణ ఉపాధ్యక్షులు గోపి, మైనార్టీ నాయకులు ఆన్స్‌ర్‌, నాయకులు మారుతి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు, కౌంటింగ్‌ వేళ కుట్రలు, కుతంత్రాలు

గ్లాసు గుర్తు ఎవరిదో తెలియని మడకశిరలో వేల ఓట్లు ఎలా పడ్డాయి?

విలేకరుల సమావేశంలో ఈర లక్కప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement