● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి
పావగడ: తాలూకాలోని తిమ్మమ్మనహళ్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. తిమ్మమ్మనహళ్లికి చెందిన తండ్రి రామాంజినప్ప, కుమారుడు చరణ్ కదిరి నరసింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా.. కదిరికి ఆరు కిలోమీటర్ల దూరంలో టాటా ఏస్ వాహనం టైర్ పేలి వాహనం రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తండ్రి రామాంజినప్ప తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడు చరణ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామాంజినప్ప మృతి చెందాడు. అంత్యక్రియలు గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుర్తు తెలియని శవం లభ్యం
సోమందేపల్లి(పరిగి):సోమందేపల్లి మండలంలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండలంలోని గుడిపల్లి పవర్ ఇండస్ట్రియల్ ఏరియా పరిధి బెల్ కంపెనీ కాంపౌండ్ వద్ద విగతజీవిగా పడి ఉన్న గుర్తు తెలియని శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ అనంతరం అనాథ శవంగా పేర్కొన్నారు.


