ఉదయం 7 గంటలకే పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉదయం 7 గంటలకే పోలింగ్‌

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

● ఎన్నికల నిర్వహణకు

అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి

● ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్త్‌

పుట్టపర్తి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల సమరంలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ఆదివారం జరగనుంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రాజకీయ పార్టీల ప్రచార హోరు శుక్రవారం ముగిసింది. ఇప్పుడు ఓటరు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం జర గనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పుట్టపర్తి మున్సిపాలిటీలో వార్డులు 28, పోలింగ్‌ బూతులు 29, పీఓలు 35, ఏపీఓలు 35, ఓపీఓలు 139 మందిని నిమించారు. పెనుకొండలో వార్డులు 23, బూతులు 28, పీఓలు 34, ఏపీఓలు 34, ఓపీఓలు 130 మందిని నియమించారు.

7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం:

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్‌పోలింగ్‌ ఉంటుంది. 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓటర్లు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపు పత్రాలతో పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్త్‌:

ఎన్నికల భద్రత కోసం 1,500 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అందుకనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టారు. సివిల్‌ పోలీసులతోపాటు ఏఆర్‌, స్పెషల్‌ పార్టీ ఏపీఎస్సీ బలగాలను నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీస్‌ బృందాలు, రూట్‌ మొబైల్స్‌, 61 స్ట్రెకింగ్‌ ఫోర్స్‌లతో నిరంతరం గస్తీ పర్యవేక్షణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళిని అమల్లో ఉంచుకొని పోలింగ్‌ కేంద్రాల వద్ద 30 యాక్ట్‌ 144 సెక్షన్‌తోపాటు పోలింగ్‌ కేంద్రాల చుట్టూ 100 మీటర్లు ఆంక్షలు విఽధించిట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement