పోలింగ్‌ కేంద్రాల్లో పొరపాట్లకు తావులేదు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల్లో పొరపాట్లకు తావులేదు

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

పెనుకొండ రూరల్‌: ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ పీఓలు, ఏపీఓలు అప్రమత్తంగా, నిబంధనలకనుగుణంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని, ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి అందజేసిన ఎన్నికల సామగ్రిని కలెక్టర్‌ తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఎన్నికలు జరగాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూములు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో భద్రత చర్యలు, ఎన్నికల నిబంధనలు అమలు చేయాలన్నారు. ఆర్డీఓ ఆనంద్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సతీష్‌ కుమార్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

300 మందిని విధులకు కేటాయింపు..

మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులు ఉండగా, 28 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. అధికారులు ఒక్కో బూత్‌కు ఆరుగురు సిబ్బందిని నియమించారు. 28 బూత్‌లకు మొత్తం 168 మంది ఎన్నికల సిబ్బంది కాగా, అదనపు సిబ్బంది, భద్రతా సిబ్బంది, ట్రాన్స్‌పోర్ట్‌, కార్యాలయ సిబ్బంది మొత్తం 300 మంది దాకా ఎన్నికల విధులకు కేటాయించారు. కాగా, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులకు సక్రమంగా భోజన సౌకర్యం కల్పించకపోవడంతో అవస్థలు పడ్డారు. ఒకటే భోజన కౌంటర్‌ ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు క్యూలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement