హిందూపురంటౌన్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. శనివారం హిందూపురంలోని వన్‌టౌన్, టూటౌన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలైన మోతుకుపల్లి, హస్నాబాద్, రహమత్‌పురంలోని పోలింగ్ కేంద్రాలను డీఎస్పీ రవిబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి, నిరంతర నిఘా ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండకూడదన్నారు. ఓటర్లు ప్రశాంతంగా క్యూలో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనుమతి లేని వ్యక్తులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించరాదని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సీఐ ప్రసాద్‌బాబు, కరీం, జనార్దన్, ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఎస్పీ సతీష్‌కుమార్


