బాలికలకు భద్రత కరువు | - | Sakshi
Sakshi News home page

బాలికలకు భద్రత కరువు

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

● జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

పరిగి: కూటమి ప్రభుత్వంలో బాలికలకు భద్రత కరువైంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బాలికల రక్షణకు ప్రత్యేక చట్టాలు తెస్తామని చెప్పిన నాయకులు.. అధికారంలోకొచ్చిన తర్వా త విస్మరించారని.. రాప్తాడులో జరిగిన ఘటనలో బాధితులకు ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌ నిలదీశారు. ఈసందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థినిపై దారుణంగా దాడి చేసి, అడ్డుకోబోయిన విద్యార్థినిని గాయ పరిచిన దుర్మార్గుడిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. సాక్షాత్తూ హోం మంత్రి అనిత, మంత్రి నారాలోకేష్‌ స్పందించకపోవడం విచారకరమన్నారు. పరిటాల సునీత ఇలాఖాలో వరుస దారుణాలు జరుగుతున్నా పట్టించుకునేవారు లేరని విమర్శించారు. రాప్తాడు ఉదంతంపై మంత్రి సవిత నోరెందుకు మూగబోయిందని ఉషశ్రీచరణ్‌ ప్రశ్నించారు. పాఠశాల తరగతి గదిలోకి రంపంతో వచ్చి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మంత్రులకు తెలియదా? అంటూ ధ్వజమెత్తారు. ఇదే రాప్తాడు నియోజకవర్గంలోని ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఎంతమందిని శిక్షించారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement