స్ఫూర్తిదాయకం పటేల్‌ జీవితం | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తిదాయకం పటేల్‌ జీవితం

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

పుట్టపర్తి టౌన్‌: దేశ సమగ్రత, ఐక్యతకు కృషి చేసిన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా పేర్కొన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్‌ శాఖ అధ్వర్యంలో శనివారం రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్‌ ఎస్పీ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెట్రోల్‌బంక్‌ సమీపంలోని రింగ్‌రోడ్డు నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పోలీస్‌ కార్యాలయంలో సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత కోసం పటేల్‌ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొన్నారు. అనంతరం దేశం యెక్క సమైక్యతా భధ్రత కాపడుతానని పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఓ వేణుగోపాల్‌, సూపరింటెండెంట్‌ సరస్వతి, ఆర్‌ఐలు వలి, ఆర్‌ఎస్‌ఐ ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు

రాష్ట్రస్థాయి

ఖోఖో పోటీలకు ఎంపిక

ముదిగుబ్బ: కొడవండ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎ. కళ్యాణి అనే విద్యార్థి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై ంది. గత శుక్రవారం ఉరవకొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–14 విభాగంలో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు హెచ్‌ఎం ఆర్‌. రామానాయుడు, పీడీ శాంత లింగం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థిని అభినందించారు. ఉపాధ్యాయులు రమేష్‌, చితంబర్‌రెడ్డి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపిక

ముదిగుబ్బ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హర్షిత అండర్‌–14 రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయికి ఎంపికై న హార్షితను పాఠశాల హెచ్‌ఎం రమాదేవి, వ్యాయామ ఉపాధ్యాయురాలు రేఖ, హాకీ కోచ్‌ షెక్షావలి, ఉపాధ్యాయులు అభినందించారు.

నేటి నుంచి

కేంద్ర బృందం పర్యటన

బత్తలపల్లి: కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం నుంచి 4వ తేదీ వరకు కేంద్ర బృందం పర్యటించనున్నట్లు తహసీల్దార్‌ ఈశ్వర్‌ప్రసాద్‌, ఏఎస్‌ఓ డాక్టర్‌ కెఎస్‌.లక్ష్మీనరసింహశర్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్‌ 3న బత్తలపల్లి, గుమ్మల్లకుంట, దంపెట్ల, రామాంజులపల్లిలో పర్యటించనుందని పేర్కొరు. ఆయా గ్రామాల్లో పంటల పరిస్థితి, రైతులకు జరిగిన పెట్టుబడి నష్టం, సాగు, తాగునీటి కొరత వంటి అంశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. రైతులతో నేరుగా మాట్లాడి వివరాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక..

క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు, పంట నష్టానికి సంబంధించిన ఆధారాలు, రైతుల అభిప్రాయాల ఆధారంగా బృందం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా కరువు సహాయ చర్యలు, పరిహారానికి సంబంధించిన తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి మండలంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement