ఓడీచెరువు: ఓటర్లను అయోమయంలో పడవేసి లబ్ది పొందాలనే ఉద్దేశంతో కావాలనే అధికారులు బ్యాలెట్ పేపర్లలో సీరియల్ నంబరు మార్పు చేసినట్లు ఎంపీటీసీ అభ్యర్థులు వాపోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులతో కూడిన బ్యాలెట్ నమూనా రిటర్నింగ్ అధికారి సంతకం చేసి అభ్యర్థులకు ఇచ్చారు. అభ్యర్థులు నమూనా బ్యాలెట్ ముద్రించి ఇంటింటా ప్రచారంలో పంపిణీ చేస్తున్నారు. అయితే మండల పరిషత్ కార్యలయంలో నోటీసు బోర్డులో వున్న నమూనా వేరుగా ఉంది. సీరియల్ నెంబర్ మారిపోయి పైనవున్న అభ్యర్థులు కిందకు, కింద ఉన్న అభ్యర్థులు పై వరుసలోకి మారడంతో అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. రిటర్నింగ్ అధికారిని వివరణ కోరగా ఆర్డీఓ కార్యాలయంలో మార్పు చేశారని, నోటీసు బోర్డులో చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని చెప్పుకొచ్చారు.


