ఓటుతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

ఓటుతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

పరిగి: ఓటుతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం ఆమె శాసనకోటలో జెడ్పీటీసీ అభ్యర్థి సత్యప్రకాష్‌, ఎంపీటీసీ అభ్యర్థి నరేష్‌బాబుతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండట్టారు. అలాగే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ప్రజాస్వామ్య విలువను కూటమి నేతలకు తెలిసొచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు.

రావణకాష్టంగా రాష్ట్రం

సీఎం చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులు బనాయించి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని ఉషశ్రీచరణ్‌ ధ్వజమెత్తారు. అడ్డదారుల్లో అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. పై స్థాయి నాయకుల నుంచి క్రింది స్థాయి కేడర్‌ వరకూ ఇలా రాష్ట్రాన్ని, ప్రజా సంపదను దోచేస్తూ అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని వ్యవహరిస్తే కనీసం మానవతావిలువలు కాపాడిన వ్యక్తులుగా నిలుస్తారని లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఫ్యాను గుర్తుకు ఓటేసి తమ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement