హిందూపురం టౌన్: ఎకై ్సజ్ అధికారుల శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ కర్ణాటక మద్యం ఏరులై పారుతుండడంపై శనివారం సాక్షి దినపత్రికలో ‘హద్దు దాటుతున్న కిక్కు’ అనే శీర్షికపై కథనం వెలువడడంతో ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. చెక్‌పోస్టులు, కర్ణాటక తరలివచ్చే మార్గాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి 42 లీటర్ల 398 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని, ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య వివరాలు వెల్లడించారు. హిందూపురం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో పరిగి మండలం ధనాపురం క్రాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం మీద కర్ణాటక మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిను అరెస్ట్ చేసిన అతని వద్ద నుంచి 96 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే సూగూరు క్రాస్‌లో ఒక వ్యక్తి నుంచి 83 కర్ణాటక మద్యం ప్యాకెట్లను, తూమకుంట తనిఖీ కేంద్రం వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి 106 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, పూలకుంట క్రాస్ వద్ద ఒక వ్యక్తి నుంచి 12 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే 9 మంది పాత ముద్దాయిల మీద బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. కల్లు శాంపిల్స్ 11, మద్యం శాంపిల్స్ 3 సేకరించి, ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. దాడుల్లో తూమకుంట చెక్‌పోస్ట్ సీఐ వెంకటేష్, ఎస్‌ఐలు పృథ్వి, వెంకటేష్, ట్రైనీ ఎస్‌ఐలు పృథ్వి, వినయ్ కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


